వాట్సాప్ కు గ్రహణం.. గగ్గోలు పెడుతున్న నెటిజనం
posted on Oct 25, 2022 @ 2:06PM
మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలకు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్లనే వాట్సప్ సేవలు నిలిచిపోయాయని భావిస్తున్నారు. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో ఆ యాప్ యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి అవకావం లేకుండా సేవల మొత్తం నిలిచిపోయాయి. వాట్సప్ కాల్స్ కు కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ.. వాట్సాప్ పర్సనల్ చాట్స్‌తో పాటు గ్రూప్స్‌కు కూడా సందేశాలు పంపే, స్వీకరించే సేవలు స్తంభించిపోయాయి. .
ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ విషయాన్ని వెల్లడించింది. దీంతో నెటిజన్లు వాట్సాప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యగ్రహణం మాట దేవుడెరుగు.. వాట్సాప్ కు గ్రహనం పట్టిందని గగ్గోలు పెడుతున్నారు నెటిజనం.