చెల్లెళ్లకు మిగిలేది దిగులేనా?

అన్నీ, అంద‌రూ ఉన్నా కొంద‌రికి జీవితం ఏమాత్రం సుఖంగా సాగ‌దు. అధికారం, పిలిస్తే ప‌లికే మ‌నుషు లు అంతా ఉన్న‌ట్టే  ఉంటుంది కానీ ఎవ‌రూ, ఏదీ త‌మ‌వి కావ‌న్న బాధ మ‌నసుని తినేస్తుంటుంది. ఎవ‌రికి ఎవ‌రు చివ‌రికి ఎవ‌రు.. వంటి గీతాలే బాగా ఇష్టంగా పాడుకోవాల్సిన ఒంట‌రిత‌నంలో మిగిలి పోతుంటారు. ఇపుడు ఇలాంటి వెలుగు జారిపోతున్న రాజ‌కీయ గ‌దుల్లో ఇద్ద‌రు ఆడ‌పడుచులు బెంగె ట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. ఒకరు ఆంధ్రా, మ‌రొక‌రు తెలంగాణాకి చెందిన‌వారు. వారే ఆర్‌.కె. రోజా, క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

ఆర్‌.కె. రోజా అనేకంటే ఒక‌నాడు టాలీఉడ్‌ని ఏలిన సూప‌ర్ హీరోయిన్ రోజా అంటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. వివాహం త‌ర్వాత సినిమాలు త‌గ్గించుకున్న రోజా మెల్లగా రాజ‌కీయాల్లో ఆస‌క్తితో అడుగిడినా త‌న వాక్చాతుర్యం, ధైర్య‌సాహ‌సాల‌తోనే అంద‌రికీ బాగా ఎరుక‌. ఏమాత్రం భ‌యంలేని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, విప‌క్షాల‌వారితో అంతే స్థాయిలో విరుచుకుప‌డ‌టంలో ఆమె ప్ర‌త్యేకత ఆమెది. రోజా బీఎస్సీ చదువుతున్న ప్పుడే ప్రేమ తపస్సు సినిమా ద్వారా సినిమాలకు పరిచయమైంది. అంతకు ముందు ఆర్కే రోజా తమిళ చిత్రం చంబరతిలో నటించారు. ఈ చిత్రం కోలీవుడ్‌లో మ్యూజికల్ హిట్ అయ్యింది తెలుగులోకి చేమంతి అనే టైటిల్ తో డబ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్కే సెల్వమణి ఈ చిత్రాన్ని రూపొం దించారు. రోజా అతనిని వివాహం చేసుకున్నారు.

ఆర్కే రోజా 2004లో నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆమె చెంగారెడ్డి రెడ్డివారిపై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె మళ్లీ పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరిన రోజా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రోజా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి చా రు. 2014 అసెం బ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్, దివంగత సీనియర్ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై రోజా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌పై విజ యం సాధించారు. వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. ప్రతిపక్షాలను సైతం వదలడం లేదన్న విషయం తెలిసిం దే. రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెది తనదైన శైలి. 2020 నుంచి రెండేళ్లపాటు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం లో మంత్రిగా చేస్తున్నారు. 

కానీ వాడిగా, వేడిగా మారిపోతున్న రాజ‌కీయాల్లో ఆమె న‌మ్ముకున్న పార్టీగాని, అన్న సీఎం జ‌గ‌న్ గాని ఆమె రాజ‌కీయ భ‌వి ష్య‌త్‌కు ఢోకా లేద‌ని మాత్రం చెప్ప‌లేక‌పోతున్నారు. కార‌ణం పార్టీ ప‌రిస్తితులు అధోగ‌త‌కి మ‌ళ్లాయి. సినిమాల్లో, టీవీ షోల కంటే ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాలంటే రాజ‌కీయాల్లోనే ఉండాల‌న్న నిర్ణ‌యం తో వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ, ఆమెకు మొద‌టి నుంచి త‌గినంత గుర్తింపు ల‌భించ‌లేద‌నే అనాలి. కేవ‌లం విప క్షాల‌వారి మీద విరుచుకు ప‌డ‌టం త‌ప్ప పార్టీవారు, సీఎం జ‌గ‌న్ చెల్ల‌మ్మా అన‌డం త‌ప్ప ఆమెకు త‌గ్గ స్థాయిని తొలి విడ‌త కల్పించ‌లేదు. క్ర‌మేపీ ప్ర‌భుత్వ విధానాలు, పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగెత్తి ప్ర‌భుత్వ వైఖ‌రిని దుయ్య‌ప‌ట్ట‌డం ఆరంభించారో అప్ప‌టికి మంత్రివ‌ర్గంలో మార్పులు ఎంతో అవ‌స‌ర‌మ‌న్న జ్ఞానం క‌లిగి రోజాను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. కానీ ఇది మూడేళ్ల ముచ్చ‌ట కూడా కాద‌న్న‌ది ఆమెకు తెలు సు. మూడేళ్ల పాల‌న త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు ప్ర‌భు త్వం ప‌ట్ల ఏమాత్రం ఆస‌క్తి లేక‌పోవ‌డం, పార్టీలో నాయ కుల‌కు, అధినేత‌కు మ‌ధ్య ప‌నితీరులో వ‌చ్చిన వ్య‌త్యాసాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న అన్నీ వెర‌సి  రెండోవిడ‌త మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన మంత్రుల‌కు ఇబ్బందిక‌రంగానే ఉంది. ముఖ్యంగా నాని వంటి వారు నోటి దురుసుతో ప్ర‌తిప‌క్షం మీద‌, నాయ‌కుల మీద భాష‌లో లేని మాట‌ల‌తో చాలా ఛండాలమైన‌ తిట్ల‌పురాణాం అందుకోవ‌డంతో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితులు  రోజా వంటి కొత్త మంత్రుల‌కు మ‌రి జ‌నాల్లోకి వెళ్ల‌డానికి ఇబ్బందిక‌రంగానే మారాయ‌నాలి. రాబోయే ఎన్నిక‌లనాటికి పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని, భారీ మెజారిటీతో గెల‌వాలంటే త‌న‌తోపాటు అంద‌రూ క‌ష్టించి ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌వ‌చ‌నం లాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌డం రోజా వంటి కొత్త మంత్రుల‌కు మ‌న‌సు క‌ష్ట పెట్టింది. మూడేళ్ల‌న్నా సుఖంగా ఉండాల‌నుకుంటే విప క్షాల తిట్లు తినాల్సి వ‌స్తోంద‌న్న బాధ క‌క్క‌లేక మింగలేకుండా ఉన్నారు. పార్టీని మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి తీసికెళ్లి గ‌తంలో కంటే నాలుగు ఓట్లు ఎక్కువ‌చ్చేట్టు చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డంలో లోపం లేక‌పోవ‌ చ్చు. కానీ ప్ర‌య‌త్నాల‌న్నీ ఆల‌స్యంగా ఆరంభిం చ‌డం తోనే విప‌క్షాలు ల‌బ్దిపొందేందుకు మార్గం క‌ల్పించిన‌ట్ల‌ యింది. ఊహించ‌నివిధంగా మ‌ళ్లీ టీడీపీ ని, చంద్ర బాబు నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు ఆశిస్తున్న ఈ త‌రుణంలో జ‌గ‌న‌న్న ఇక నిల‌వ‌లేని స్థితిలో ఉన్నారు. చెల్లి రోజాను గ‌ట్టిగా హెచ్చ‌ రించ‌లేని స్థితి  ఆ  అన్న‌ది. చెల్లి రోజా కేవ‌లం న‌వ్వ‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌ల‌ని ప‌రిస్థితుల్లో మౌనంగా ఉండిపోతోంది. ప‌ర్య‌ట‌క మంత్రి ప‌ద‌వి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే అయింది. జ‌బ‌ర్ ద‌స్త్ సీన్లు రిపీట్‌గా చూపించినా అస్సలు న‌వ్వు చిలికే ప‌రిస్థితి లేదు. 

ఇక తెలంగాణా ముద్దుబిడ్డ‌, తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత. హైద‌రాబాద్ జెఎన్‌టీయూలో ఇంజ‌నీ రింగ్ చేసిన క‌విత రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ముందు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 2006లో న‌ల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్ప‌డ్డారు. ఆమె భ‌ర్త అనిల్ కుమార్  ఇంజ‌నీర్‌. క‌ల్వ‌కుంట్ల క‌విత అనేక కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియ‌న్ల త‌ర‌ఫు న కూడా కొంత కాలం ప‌నిచేశారు. 2014లో తెలంగాణా ఆవిర్భావం, కావ‌డంతో ఆమె నిజా మాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ఏకంగా ల‌క్షా 70వేల మెజారిటీతో గెలిచారు. ఎంపీగా తెలంగాణా, ఇత‌ర జాతీ య‌ స‌మ‌స్య‌ల్ని పార్ల‌మెంటులో చ‌ర్చించి జాతీయస్తాయిలో అన్ని పార్టీలూ ఆలోచించేలా చేశారు. పార్ల‌మెంటులో అనేక ప్ర‌ముఖ క‌మిటీల‌కు గౌర‌వ స‌భ్యురాలుగానూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా సాగి పోతున్న ఆమె రాజ‌కీయ జీవితానికి ఊహించ‌ని విధంగా   ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం మాయ‌ని మ‌చ్చ‌గా త‌యార‌యింది. ఆమెను అప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంచి స్నేహితురాలిగా, అక్క‌గా, చెల్లి గా భావించుకున్న రాజకీయ‌నాయ‌కులు, స‌న్నిహితులంతా దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది స్వ‌యంకృత‌మా అంటే అవున‌నే అంటున్నాయి వార్తలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణా నికి సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. 

తాజాగా ఈ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తు న్నా యి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని, ఈ విధానం రూపకల్పనకు సంబంధిం చిన భేటీ లకు కేసీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారని పర్వేశ్ వర్మ ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంతో నేరుగా సంబంధం ఉందని, ఎక్సైజ్ కమిషనర్‌తో పాటు కేసీఆర్ కుటుంబం కూడా డీల్‌ రూపకల్పనలో భాగస్వామమై ఉందన్నారు. త‌ర్వాత డొంక క‌దిలి హైద‌రాబాద్‌లోనూ ఈడీ, సీబీఐ దాడులు, సోదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ వంటి పెద్ద పెద్ద మాల్స్ ల్లోనూ సోదాలు జ‌ర‌గ‌డం సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్నీ ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది. ఇపుడు క‌విత‌కు త‌ప్పించు కునేందుకు స‌మ‌యం త‌గ్గింది. ఉచ్చుబిగుస్తోంద‌న్న వార్త‌లే విన‌బ‌డుతున్నాయి.

ఒక‌వంక మునుగోడు ఉప ఎన్నిక‌, మ‌రో వంక కుమార్తె క‌విత రాజ‌కీయ భ‌విత రెండూ తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్‌కు క‌డు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేశాయి. కూతురిని కాపాడుకోవ‌డానికి ఢిల్లీలోనే కేసీ ఆర్ మకాం వేశారు. కేంద్రం మీద విరుచుకు ప‌డే కేసీఆర్ ఇపుడు కేంద్రంలోని కీల‌క బీజేపీ నాయ‌కుల‌తో మంతనాలు చేస్తున్నారు. కూతురుని ఆ ఉచ్చునుంచి త‌ప్పించాల ని వేడుకుంటు న్నార‌నే అనాలి. త‌న‌ను త‌న తండ్రి ర‌క్షించాలి, బీజేపీ మాట వినే ఆర్ ఎస్ ఎస్ నేత‌లు ర‌క్షించాల‌ని దేవుడిని  ప్రార్ధిస్తున్నారు.  అన్ని దారులూ మూసుకుపోయి తాను రాజ‌కీయాల‌కు మ‌రీ దూర‌మ‌యి సాధా ర‌ణ మ‌హిళ‌గా మిగిలిపోవ‌డం కంటే తండ్రి స‌హ‌కారంతో కేంద్రంలో వారిచేత స‌రే ర‌క్షిస్తామ‌ని పించుకోవ‌డ‌మే ఇక క‌విత‌కు మిగిలింది. కానీ అది అంత సులువుగా జ‌రు గుతుందా అన్న‌దే అను మానం. తెలంగాణా రాజ‌కీయ నాయ కులు అంద‌రూ కేంద్రం మీద ప్ర‌తీ అంశంలోనూ విరుచుకు ప‌డుతున్నారు. మునుగోడులో గెల‌వాల‌న్నా, పోనీ ప‌రువు ద‌క్కించుకోవాల‌న్నా ఈ కుంభ‌కోణం ఉచ్చునుంచీ క‌విత య‌మ‌ర్జంట్‌గా బయట ప‌డాలి. కేసీఆర్ సొంత‌గా విమానం కొన‌డం మంచిద‌యిం ద‌నే అనుకోవాలి. ఢిల్లీ, హైద‌రాబాద్ చ‌క్క‌ర్ల‌కు ఇబ్బంది లేకుం డా పోయింది. లేకుంటే ప్ర‌తీ విమానాశ్ర‌యంలోనూ కూతురు గురించి ప్ర‌తీవారూ ప్ర‌శ్నించి వేధిం చే అవ‌కాశ‌మే ఉంటుం ది.కేసీఆర్ త‌న ప‌రువు ప్ర‌తిష్ట ప‌క్క‌న‌పెట్టి కూతురు క‌ష్టాలు తీర్చ‌డానికి తండ్రిగా వ్య‌వ‌హ‌రిస్తారా, బీఆర్ ఎస్ అధినేత‌గానా, తెలంగాణా ముఖ్య‌మంత్రిగానా అన్న‌ది వేచి చూడాలి. కానీ క‌ల్వ‌కుంట్ల క‌విత మాత్రం లోలోప‌ల దుఖిస్తూ ఆట్టే రోజులు వేచి ఉండ‌లేక పోవ చ్చు. తండ్రి నుంచే స‌హాయం ఏమాత్రం అందు తుంది, ఆయ‌న ఏమాత్రం కాపాడుతాడ‌న్న‌దే భీతితో ఆమె ఎదురుచూస్తోంది. త‌మ్ముడు కేటీఆర్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న ప్ర‌చారం బాగా ఉంది. ఆయ‌న‌కు ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే మ‌రో ఉన్న‌త ప‌ద‌వికి దారి సుగ‌మ‌మ‌వుతుంద‌న్న గొప్ప ఆనందం ఆయ‌న‌ది.

ఎన్నికల వేళ.. ఘర్షణలు, దాడులు.. పలు గ్రామాల్లో ఉద్రిక్తత

రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్  సందర్భంగా కొన్ని  గ్రామాలలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.   నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్‌పేట్‌ లో సర్పంచ్ ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంచుతున్నారంటూ ఆరోపణలు గుప్పించుకుంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారీని చెదరగొట్టి పోలింగ్ కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జి చేశారు.   ఇక ఖమ్మం జిల్లా కొ కొండవనమాల లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న అర్ధరాత్రి   వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఈ ఉదయం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజకీయకక్షతోనే ప్రత్యర్థులు తన ఇల్లు దగ్ధం చేయడానికి ప్రయత్నించారంటూ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   సరే ఈ ఘటన కారణంగా పోలింగ్ సమయంలో ఘర్షణలు తలెత్తకుండా గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంద. అదే విధంగా  నల్గొండ జిల్లా  కొర్లపహాడ్‌ గ్రామంలో  పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక ర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. పోలింగ్ కొనసాగుతోంది. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.  

తొలి విడత పంచాయతీ పోలింగ్ షురూ!

తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల  పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) ఉదయం షురూ అయ్యింది. తొలి విడతలో 3, 834 సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా పంచాయతీలలో విజయం సాధించిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ లను ఎన్నుకుంటారు.  వాస్తవానికి తొలి దశలో మొత్తం 4, 236 సర్పంచ్ పదవులకు ఎన్నిక జ రగాల్సి ఉండగా, ఐదు సర్పంచ్, 169 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే 396 పంచాయతీలలో సర్పంచ్ లు, అలాగే 9633 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక పోతే.. ఒక పంచాయతీ సర్పంచ్, 10 వార్డు సభ్యుల ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. దీంతో 3, 834 సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 

సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకుంటున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.  మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ప్రచారం కోసం ఏకంగా  ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నే రంగంలోకి దింపాశారు. తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్తవంగా అల్లు అర్జున్ ఆ సర్పంచ్ అభ్యర్థికోసం చేయడంలేదు. అలా చేస్తున్నట్లుగా సదరు సర్పంచ్ అభ్యర్థి ఏఐ టెక్నాలజీతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోను తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

త‌మిళ‌నాట కార్తీక దీపం చిచ్చు! పవన్ ఏమన్నారంటే?

తమిళనాట కొత్త చిచ్చు రేగింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి. ఇంతకీ విషయమేంటంటే.. మ‌ధురైకి ద‌గ్గ‌ర్లో ఉన్న తిరుపుర‌కుండ్రం అనే కుమార స్వామి క్షేత్రంలో కార్తీక దిపానికి సంబంధించినది. త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా  భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ  కార్తీక దీపం  పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం. అయితే ఇక్క‌డి ద‌ర్గాకు కుమార‌క్షేత్రానికి చారిత్ర‌క సంబంధాలుండ‌టంతో వివాదం  చెల‌రేగింది. ఈ స్తంభంపై కార్తీక దీపం పెట్ట‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో  విషయం కాస్తా  కాస్తా కోర్టు మెట్లు ఎక్కింది.  ఈ విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు, మ‌ధురై బెంచ్ న్యాయ‌మూర్తి స్వామినాథన్ ఈ దీపం ఇక్క‌డ వెలిగించ‌డానికి అధికారులు త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ  చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం..  , ఇక్క‌డ కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చు. అయితే ఇలా చేస్తే  మ‌త ఘ‌ర్ష‌ణకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం  దీపం పెట్ట‌నివ్వ‌కుండా,   హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు  కూడా మ‌ధురై బెంచ్ ఇచ్చిన తీర్పునే స‌మ‌ర్ధించింది. దీంతో దీపం  వ్య‌వ‌హారంలో తిరుపుర‌కుండ్రంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగింది. ఒక వ‌ర్గం వారు ఇక్క‌డ దీపం  వెలిగించాలంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చి  పోలీసులు సైతం గాయ‌ప‌డ్డారు.   లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కార్తీక దీపం వెలిగించాలంటూ   తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథ‌న్ పై అభిశంస‌న తీర్మాన‌రం పెట్టాల‌ని నిర్ణ‌యించారు ఇండి  కూట‌మి ఎంపీలు. వీరంతా  క‌ల‌సి ఈ దిశ‌గా ఒక మెమ‌రాండం సైతం స‌మ‌ర్పించారు.  దీనిపై స్పందించిన   ఏపీ డిప్యూటీ  సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో సుప్రీం  కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హిందూ దేవ‌త‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఏ పార్టీ ఆయ‌నపై అభిశంస‌న  పెట్ట‌డానికి ముందుకు రాకపోగా  ఆయ‌న్నే వెన‌కేసుకొచ్చార‌న్న పవన్ స్వామినాథ‌న్ ఏం చేశార‌ని  అభిశంస‌న పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారో అర్ధం కావ‌డం లేదన్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తకుండా స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్య‌వ‌స‌రం అంటూ  ట్వీట్   చేశారు.

పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

పుత్రిక రాజ‌కీయ అరంగేట‌గ్రం.. గ్రౌండ్ ప్రిపరేషన్ లో బొత్స!

బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.  చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.  తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.

గుంతకల్లులో కీలక నేతల వారసత్వ రాజకీయం

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.

డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  

విజయసాయి కాషాయ మంత్రం..జగన్ కు కషాయం!

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.