శుభమా అని శుభలేక ఓపెన్ చేస్తే
posted on Aug 24, 2025 @ 10:52AM
వెడ్డింగ్ కార్డ్ వాట్సప్ లో వచ్చింది కదాని ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బు ఖాళీ అవుతుందని మీకు తెలుసా? పిచ్చి పలు రకాలు అన్నట్టు మోసం కూడా అంతే. ఇందుకోసం రకరకాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు మహారాష్ట్ర హింగోలీకి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అడ్డంగా బుక్ అయిపోయారు.
ఆగస్టు 30న పెళ్లి.. ఉందంటూ వాట్సప్ లో ఒక ఇన్విటేషన్ వచ్చిది. పెళ్లికి రండి. ఆనందం గేట్లు తెరవడానికి తాళం ప్రేమ అంటూ కవిత్వం అందంగా కనిపించడంతో ఆ వ్యక్తి దాన్ని ఓపెన్ చేశారు. అదొక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ. అంటే ఏపీకే. దాన్ని క్లిక్ చేయగానే అతడి డేటా మొత్తం పొందారు సైబర్ మోసగాళ్లు. ఇక అక్కడి నుంచి అతడి ఖాతా నుంచి ఏకంగా లక్షా 90 వేల రూపాయల వరకూ ఖాళీ చేశారు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీస్టేషన్లో కంప్లయింట్ చేశారు.
శుభమాని శుభలేఖ చూస్తే ఈ అశుభం ఏంటో అర్ధం కావడం లేదని వాపోవడం పలువురు బాధితుల వంతు అవుతోంది. కొత్త కొత్త దారుల్లో జనాల్ని బురిడీ కొట్టించి ఇదిగో ఇలా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అందుకే గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి ఆహ్వాన పత్రికులు, డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు, ఫైళ్లు వస్తుంటాయి.
వీటి జోలికి పోతే ఇక అంతే సంగతులు. ఒక్కసారి ఇలాంటి ఇన్విటేషన్ వంటివి డౌన్ లోడ్ చేసుకుంటే ఖేల్ ఖతం. ఫోన్ మొత్తం హ్యాక్ అవుతుంది. డబ్బులొకటే కాదు.. మన సమాచారం మొత్తం వారి పరమై పోతుంది. తద్వారా మన డాటా మొత్తం వారి కంట్రోల్ లోకి వెళ్లి పోతుంది. తర్వాత వాటిని అడ్డు పెట్టుకుని.. బ్లాక్ మెయిల్ చేస్తారు. కాబట్టి తస్మార్ట్ జాగ్రత్త!
రీసెంట్ గా ఎస్బీఐకి చెందిన ఒక రివార్డ్ లింకు కూడా సరిగ్గా ఇలాగే సర్క్యులేట్ అవుతోంది. దాన్ని గానీ తెలిసీ తెలియక ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటివి వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలని చూస్తే.. ఫర్ సపోజ్ ఇన్విటేషన్ వస్తే.. దానికి అది ఏ రకమో చివరి అక్షరాలు తెలియజేస్తాయి.
ఉదాహరణకు వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో పీడీఎఫ్ ఫైల్ పంపిస్తే వెడ్డింగ్ ఇన్విటేషన్. పీడీఎఫ్ అని, ఏపీకే ఫైల్ అయితే వెడ్డింగ్ ఇన్విటేషన్. ఏపీకే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏపీకే అని ఉంటే డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తారు నిపుణులు. ఒక వేళ తెలిసిన వారి నుంచి వచ్చిన మెసేజ్ అయినా సరే.. ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలంటున్నారు టెకీ ఎక్స్ పర్ట్స్.