వాలంటీర్ మర్డర్.. ఎందుకు చంపారంటే...
posted on Mar 13, 2021 @ 10:37AM
వాలంటీర్ శ్రీకాంత్ పొలం దగ్గర పడుకున్నాడు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్నాడు. సడెన్‌గా అతనిపై అటాక్ జరిగింది. గునపంతో పొడిచి దారుణంగా చంపేశారు దుండగులు. శ్రీకాంత్ స్పాట్‌లోనే చనిపోయాడు. వాలంటీర్ హత్య ఏపీలో కలకలం రేపింది.
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగిందీ మర్డర్. శివరాంపేటకు చెందిన వాలంటీర్ శ్రీకాంత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గునపంతో పొడిచి హత్య చేశారు. ఉదయం విషయం తెలీడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పొలంలో నిద్రిస్తున్నది శ్రీకాంత్ తండ్రి అనుకొని.. వాలంటీర్ శ్రీకాంత్ ను చంపారని అంటున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది.