బీజేపీకి 'విష్ణు' నామాలు.. విజయసాయి డైరెక్షన్‌లో డ్రామాలు!
posted on Aug 14, 2021 @ 12:43PM
కోవర్టులు అన్నిపార్టీల్లోనూ ఉంటారు. కుట్రలు, కుతంత్రాలు చేసే కుహానా లీడర్లకు సిద్ధాంత పార్టీగా చెప్పుకునే బీజేపీ సైతం అందుకు అతీతం కాదు. ఏపీ బీజేపీ మొత్తాన్ని జల్లెడ పడితే.. అందరికంటే నెంబర్‌వన్ ఫ్రాడ్‌గా తేలే లీడర్ ఒకరున్నారు. కమలంలో ఆ ఏ1 కోవర్డు లీడరు విష్ణువర్థన్‌రెడ్డి అని అంటారు. ఆయన అధికారపార్టీలో ఉన్న ఏ2 లీడర్ డైరెక్షన్‌లో పనిచేస్తారని చెబుతారు. అదేమి రాజకీయమో కానీ, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. ప్రభుత్వం మీద కంటే మరో ప్రతిపక్షమైన టీడీపీ మీదే ఎక్కువ విమర్శలు చేస్తుంటారు. రెడ్డిగా రెడ్ల పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తుంటారనే విమర్శ ఉంది. కమ్మ నాయకులే ఆయన మెయిన్ టార్గెట్ అనే ఆరోపణ కూడా ఉంది. అందుకే కాబోలు, వైసీపీ నాయకులు సైతం విష్ణువర్థన్‌రెడ్డిని పళ్లెత్తి మాట అనరు. ఈయన మాత్రం కమలం పువ్వులతో కొట్టినట్టు.. అధికార పార్టీపై సుతిమెత్తని విమర్శలతో దాడి చేసినట్టు భలే నటిస్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆశీస్సులు ఈ కాషాయ కండువా కప్పుకున్న నీలి మనిషికి ఫుల్లుగా ఉన్నాయని అంటారు. ఈ వీర భక్త విష్ణువర్థన్‌రెడ్డి గుండెలు చీల్చితే.. నరేంద్రుడు కాకుండా జగన్మోహనుడు కనిపిస్తాడని ఏపీలో సెటైర్లు పేలుతుంటాయి.
ఇక గురివింద గింజలా ఆయన కింద ఉన్న నలుపునంతా కాషాయ వర్ణంతో కప్పేసుకొని.. మీడియా వేదికలపై పేద్ద నోరేసుకొని పడుతూ.. తన పాపులారిటీ మాత్రం బాగా పెంచేసుకుంటారు. రాజధానిగా అమరావతికి బీజేపీ పార్టీ పరంగా మద్దతు పలికితే.. ఈయన మాత్రం వ్యక్తగతంతా అమరావతి ఉద్యమాన్ని, నాయకులను అవహేళన చేస్తుంటారు. కడుపు మండిన జేఏసీ నాయకుడు.. ఓ టీవీ ఛానెల్ డిస్కషన్‌లో చెప్పుతో కొట్టినా.. విష్ణువర్థన్‌రెడ్డి డబుల్‌గేమ్ పాలిటిక్స్‌లో ఏమాత్రం మార్పురాకపోవడం సిగ్గు..సిగ్గు...
ఇలాంటి కుట్రలు, కుతంత్రాలతోనే విష్ణువర్థన్‌రెడ్డి బీజేవైఎమ్ అధ్యక్షుడి నుంచి బీజేపీ జనరల్ సెక్రటరీ స్థాయి వరకూ ఎదిగారని అంటారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్యక్ష పదవిపైనే కన్నేసారని అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎపిసోడ్‌లో అధ్యక్షుడు సోము వీర్రాజును ట్రాప్‌లో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసి.. సోము పదవికే ఎసరు వచ్చేలా చేశారు. వీర్రాజును బద్నామ్ చేసి.. ఆయన సీటును కొట్టేయాలనేది ఈయన స్కెచ్‌లా కనబడుతోందని బీజేపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
టిప్పుసుల్తాన్ విగ్రహ రాజకీయంపై పొద్దుటూరులో హైడ్రామా నడిచింది. విగ్రహం ఏర్పాటుకు కడప జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరిస్తూ.. జులై 23న ఉత్తర్వులు ఇచ్చారు. కామెడీగా.. విగ్రహ ఏర్పాటు వద్దంటూ జులై 27న సోము వీర్రాజు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో బీజేపీ ధర్నా చేసింది. అప్పటికి నాలుగు రోజుల ముందే కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని విష్ణువర్థన్‌రెడ్డి కావాలనే మరుగున పెట్టి.. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజును ఉసిగొల్పి.. ఆయనతో ధర్నా చేయించి.. పార్టీ పరువు తీయడంతో పాటు అధ్యక్షులు వీర్రాజునూ కామెడీ పీస్‌గా మార్చేశారని.. అదంతా విజయసాయి డైరెక్షన్‌లో విష్ణువర్థన్‌రెడ్డి ఆడిన పొలిటికల్ డ్రామా అనేది బీజేపీ వర్గాల అనుమానం. తమ వాడైన విష్ణును ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలనేది విజయసాయి స్కెచ్. సోము వీర్రాజు సైతం తమ వాడేనైనా ఆయన రెడ్డి కాదుగా. అందుకే, వీర్రాజును తప్పించి విష్ణువర్థన్‌రెడ్డిని కమల దళపతి చేసి.. టీడీపీపై దండెత్తేలా చేయాలనేది వైసీపీ పెద్దల స్కెచ్. అందుకే, విష్ణువర్థన్‌రెడ్డిని రెండేళ్లుగా పరోక్షంగా ప్రమోట్ చేస్తూ వస్తోంది అధికార పార్టీ. బీజేపీ ఇంటర్నల్ మేటర్‌ను.. నీలి మీడియాకు లీక్ చేసేది కూడా విష్ణునే అంటారు.
ఇక విష్ణువర్థన్‌రెడ్డి విషయ పరిజ్ఞానం, మేధావితనం గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఆయన చేసే ట్వీట్లలో కొన్ని మాస్టర్ పీస్‌లు ఉంటాయి. బిర బిర కృష్ణమ్మ శ్రీశైలం నుండి సాగుతు గోదావరిలో కలవడం.. గోమాత సంరక్షణ అంటూ ఎద్దు ఫోటో పెట్టడం.. మహిళలపై అసభ్య పోస్టులు.. "హేమమాలిన చర్య" లాంటి కామెంట్లు.. ఇలా తిక్కతిక్క ట్వీట్లతో తన పరమానందయ్య శిష్యరికాన్ని ట్విట్టర్ వేదికగా పలుమార్లు ఘనంగా చాటుకున్నారు. లంక దినకర్ లాంటి మేధావి నాలెడ్జ్‌లో చిటికెడంత పరిజ్ఞానం కూడా లేని విష్ణువర్థన్.. కేవలం రెడ్డి కార్డు మీదే బాగా నెట్టుకొస్తున్నారనే విమర్శ ఉంది. టీడీపీ, కమ్మ నాయకులే టార్గెట్‌గా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచనలతో చెలరేగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక మనోడి క్రైమ్ హిస్టరీపైనా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అనంతపురంలో మహిళ మిస్సింగ్ కేసు.. కల్కి ఆశ్రమంలో 30 కోట్ల దందా.. బెంగుళూరులో మెడికల్ కాలేజీ.. బినామీల పేరుతో నర్సింగ్ కాలేజీలు.. స్పా సెంటర్ల లీలలు.. అబ్బో విష్ణులీలలపై అనేక ఆరోపణలు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో కోట్ల రూపాయల అక్రమ సంపద పోగేశారనే విమర్శలు.. ఉన్నాయి. ఇప్పుడు అదే విజయసాయి మద్దతుతో ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కొట్టేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న సోము వీర్రాజును అడ్డు తొలగించుకునేందుకే.. ప్రొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్రహంపై అవుట్-డేటెడ్ ధర్నా చేయించి.. వీర్రాజు వెర్రివాడిని చేశారని అంటున్నారు. ప్రతిపక్షంలో అధికారపక్ష నేతగా ఉన్న విష్ణు.. బీజేపీకి పంగనామాలు పెడుతూ.. వైసీపీపై ఉత్తుత్తి పోరాటం చేస్తూ.. టీడీపీ-కమ్మ శ్రేణులపై మాటలతో కత్తియుద్ధం చేస్తుంటారని అంటారు. విష్ణువర్థన్‌రెడ్డి వల్ల బీజేపీకి ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోగా.. వ్యక్తిగతంగా ఆయనకు, పరోక్షంగా వైసీపీకి ఫుల్ ప్రయోజనాలు కలుగుతున్నాయని చెబుతారు. కమలం పూదోటలో కలుపుమొక్క విష్ణువర్థన్‌రెడ్డి అనేది కమలనాథుల మాట.