విశాఖ బీచ్‌లో ప్రధాని యోగా…ఏర్పాట్లలో ముఖ్య మంత్రి
posted on Jun 15, 2025 @ 11:55AM
ఈనెల 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు . ఆ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. 21న జరిగే కార్యక్రమం లో హాజరయ్యేందుకు ప్రధాని ముందు రోజు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. నేవెల్ గెస్ట్ హౌస్ లో ఆ రాత్రి బస చేస్తారు.మరుసటి రోజు ఆర్కే బీచ్ లో జరిగే యోగేంద్ర కార్యక్రమంలో పాల్గొంటారు
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 36 కిలోమీటర్ల దూరం ప్రజలు ఆరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే లా వినూత్న రీతిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ఈనెల 16వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకొని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. దాదాపు ఆరు లక్షల మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే రీతిన అధికారులు చర్యలు చేపట్టారు ప్రధాని పర్యటన నేపద్యంలో విశాఖలో వీధులను పెయింటింగ్ లతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఇందులో యోగాకు సంబంధించిన పెయింటింగ్ లు ఎక్కువగా ఉన్నాయి.