భగవద్గీత శ్లోకం ట్వీట్ చేసిన విజయసాయి
posted on Jul 12, 2025 @ 12:17PM
కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు..
కానీ వాని ఫలితముల మీద లేదు...
నీవు కర్మఫలములకు కారణం కారాదు...
అట్లని కర్మలను చేయుట మానరాదు ...
విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో తాజా పెట్టిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు విజయసాయి శనివారం (జులై 12) ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. సిట్ నోటీసుల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ భగవద్గీత శ్లోకాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పడు తెగ వైరల్ అయ్యింది.