విజయకాంత్ ఆరోగ్యం విషమించిందా?
posted on Jul 28, 2014 @ 11:48AM
ప్రముఖ తమిళ నటుడు, అభిమానులు ‘కెప్టెన్’ అని పిలుచుకునే డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటోన్న ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా వున్నట్టు తెలుస్తోంది. పదిహేను రోజుల క్రితం విజయకాంత్ అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన పార్టీ నాయకులు మాత్రం లోక్‌సభ ఎన్నికలలో కష్టించి పనిచేయడం వల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతింది అంతే అని చెప్పినప్పటికీ, జనం అనుమానాలు తీరలేదు. చెన్నై ఆస్పత్రి నుంచే విజయకాంత్‌ని సింగపూర్‌కి తరలించారు. అక్కడి నుంచి విజయకాంత్ కుటుంబం తిరిగి వచ్చింది. అయితే విజయకాంత్ మాత్రం వీల్ ఛెయిర్‌లో తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఆయనను ముఖం కూడా బయటకి కనిపించకుండా దుప్పట్లో కప్పేసి తీసుకెళ్ళారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి సమాచారం మీడియాకి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.