‘ఏరా’ విజయసాయిరెడ్డికి మెంటలంట!
posted on Jul 19, 2024 @ 1:01PM
‘శాంతి’కాముకుడు, ఊరకుక్కలకు గురువు, బూతుల ఫ్యాక్టరీ ఓనరు ‘ఏరా’ విజయసాయిరెడ్డికి మెంటలెక్కింది. రామరామా.. ఈ ‘మెంటల్’ అనే మాట మాత్రం మేం అనడం లేదండీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. మొన్నీమధ్య ‘ఏరా’ విజయసాయిరెడ్డి వైజాగ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి, వైజాగ్ ఆస్పత్రి నుంచి పారిపోయి వచ్చిన రేంజ్‌లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏరా’ విజయసాయిరెడ్డి ‘వ్యవహారం’ మీద మంత్రిగారు రియాక్ట్ అయ్యారు. ‘‘ఈ ‘ఏరా’ విజయసాయిరెడ్డి తన మీద వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేక, జర్నలిస్టులను ‘ఏరా, ఒరేయ్’ అనడం సిగ్గుచేటు. చేసిన పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా, తాను బాధ్యతల ఎంపీ హోదాలో వున్నాననే విషయం కూడా మరచిపోయి ‘ఏరా’ విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. దుర్మార్గంగా, బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. మీడియా సంస్థల యజమానులు, జర్నలిస్టుల మీద ‘ఏరా’ విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటు. దీనికి భవిష్యత్తులో ఆయన తప్పక మూల్యం చెల్లించుకుంటారు. ‘ఏరా’ విజయసాయిరెడ్డి కామంతో, పేర్ని నాని డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. పేర్ని నాని అక్రమ ఆస్తుల చిట్టాలన్నీ మా దగ్గర వున్నాయి. వాటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, అన్ని లెక్కలనూ త్వరలోనే తేల్చుతాం. ఒకవైపు ‘ఏరా’ విజయసాయిరెడ్డి, మరోవైపు పేర్ని నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’’ అని మినిస్టర్ కొల్లు రవీంద్ర అన్నారు.