విజయ్ మాల్యా.. నాన్ బెయిలబుల్ వారెంట్లపై విచారణ..
posted on Apr 16, 2016 @ 10:23AM
విజయ్ మాల్యాపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఎంచక్కా లండన్ వెళ్లిన విజయ్ మాల్యాకు చిన్న చిన్నగా ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు హాజరుకావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకావాలని ఆదేశించినా.. హాజరుకాకుండా పదే పదే గడువు కావాలని కోరడంతో ఈడీ మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో కేంద్రం కూడా వెంటనే స్పందించి నాలుగు వారాల పాటు మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. అంతేకాకుండా వారంలోగా ఈ సస్పెన్షన్ పై మాల్యా స్పందించకుంటే పాస్ పోర్టును పూర్తిగా రద్దు చేస్తామని కూడా ఆ శాఖ హెచ్చరించింది. దీంతో ఈడీ మరో అడుగు ముందుకేసి తమ నోటీసులకు స్పందించని మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.