ర‌ష్మిక మంథాన‌కు విజ‌య్‌తో... ఇది ఎన్నో నిశ్చితార్ధ‌మో తెలుసా!

 

సినీ జంట‌ల మ‌ధ్య పెళ్లిళ్లు ఈనాటివి కావు. కృష్ణ విజ‌య‌నిర్మ‌ల‌, జీవిత రాజ‌శేఖ‌ర్, స‌మంత నాగ‌చైత‌న్య‌, ఇప్పుడు చూస్తే గీత గోవిందం జంట‌.. ర‌ష్మిక మంథాన‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన కులాలు, ప్రాంతాలు వేర్వేరు. విజ‌య్ సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ‌.. ఇండ‌స్ట్రీని ఏలేయ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చారు. 

ఇక  దేవ‌ర‌కొండ ప్రొఫైల్ ఏంటో చూస్తే.. ఆయ‌న 1989, మే 9న హైద‌రాబాద్ లో గోవ‌ర్ధ‌న్, మాధ‌వి దంప‌తుల‌కు పుట్టారు. వీరి స్వ‌స్త‌లం తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా, తుమాన్పేట్ గ్రామం. తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ‌కు సినిమాల‌పై ఉన్న మ‌క్కువ కార‌ణంగా విజ‌య్ పుట్ట‌క ముందే హైద‌రాబాద్ వ‌చ్చారు. సినిమా న‌టుడ‌వ్వాల‌నుకున్నారు. కానీ అది కుద‌ర‌క ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేశారు. డీడీ వంటి ప‌లు టీవీ చానెళ్ల‌లో డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేసి సీరియ‌ల్స్ లో చేస్తూ వ‌చ్చారు. 

ఇక విజ‌య్ విద్యాభ్యాసం మొత్తం అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి శ్రీస‌త్య‌సాయి ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగింది. ఇక్క‌డే విజ‌య్ కి క‌థార‌చ‌న‌, న‌ట‌న పై మ‌క్కువ ఏర్ప‌డిన‌ట్టు  చెబుతారు విజ‌య్. ఆపై ఇంట‌ర్ హైద‌రాబాద్ లిటిల్ ఫ్ల‌వ‌ర్ కాలేజీలో, బ‌దృకా కాలేజ్ ఆఫ్ కామ‌ర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు విజ‌య్. 

ఆ త‌ర్వాత నాట‌కాల్లో రాణించిన విజ‌య్.. నువ్విలా సినిమాలో చిన్న పాత్ర‌తో తెరంగేట్రం చేశారు. 2012లో వ‌చ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనూ ఒక పాత్ర పోషించారు. 2015లో విడుద‌లైన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంలో చేసిన రిషి కేరెక్ట‌ర్ తో బాగా గుర్తింపు వ‌చ్చింది.

ఇక 2016లో విడుద‌లైన పెళ్లిచూపులు సినిమాలో హీరో పాత్ర ద్వారా ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లందాయి. ఇది విజ‌య్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017లో ద్వారక‌, అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. అదే సంవ‌త్స‌రం విడుద‌లైన అర్జున్ రెడ్డితో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విజ‌య్ దేవ‌ర కొండ క‌ల్ట్ క్లాసిక్, మాస్ ర్యాంపేజ్, ట్రెండ్ సెట్ట‌ర్ వంటి ప‌దాల‌కే కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. ఈ న‌ట విశ్వ‌రూపానికి విజ‌య్ స్టార్ డ‌మ్ ఆకాశానికి అంటింది.

2018 తొలినాళ్ల‌లో వ‌చ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విజ‌య్. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చ‌వి చూసాడు. ఆ తర్వాత 2018లో  టాక్సీవాలాతో మ‌రో చ‌క్క‌టి విజ‌యం న‌మోదు చేశాడు.

తాను వివాహ‌మాడ‌బోతున్న ర‌ష్మిక మంథాన‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన చివ‌రి సినిమా మాత్రం 2019లో వ‌చ్చిన డియ‌ర్ కామ్రెడ్. త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య మూవీ లేదు. కానీ వీరికి గీత గోవిందంలో క‌ల‌సి న‌టించ‌డం ద్వారా చిగురించిన ప్రేమ ప‌రిణ‌యానికి దారి తీసిన‌ట్టు తెలుస్తోంది.  అదే ఇప్పుడు వివాహ నిశ్చితార్ధం వ‌ర‌కూ వ‌చ్చింది.

ర‌ష్మికా మంథాన 1996 ఏప్రిల్ 5న క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లాలోని విరాజ్ పేట్ లో జ‌న్మించారు. కూర్గ్ ప‌బ్లిక్ స్కూల్లో చ‌దివిన ర‌ష్మిక  M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించారు. 2016లో ఆమెకు 24వ స్థానం లభించగా, 2017లో తొలిస్థానంలో నిలిచారు..

కిరాక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ర‌ష్మిక అంచెలంచెలుగా ఎదిగి నేష‌న‌ల్ క్ర‌ష్ అంటూ అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే స్థాయికి చేరారు. 2024 అక్టోబ‌ర్ లో ర‌ష్మిక‌ను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్- I4C కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుల‌య్యారు.  

ఇక్క‌డ మ‌రో ట్విస్ట్  ఏంటంటే.. ర‌ష్మిక త‌న తొలి చిత్రం కిరాక్ పార్టీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ర‌క్షిత్ శెట్టి ప్రేమ‌లో ప‌డ్డారు.  2017 జూలైలో వీరి నిశ్చితార్ధం కూడా జ‌రిగింది. త‌ర్వాత ఏమైందో ఏమో వారి మ‌ధ్య అనుబంధం చెడిన‌ట్టుగా క‌నిపిస్తోంది. దానికి తోడు ర‌ష్మిక క‌ర్ణాట‌క బోర్డ‌ర్ దాటి, ఛ‌లోతో తెలుగులోకి ప్ర‌వేశించి ఆపై గీత గోవిందంగా మేడం అనిపించుకుని అటు పిమ్మ‌ట డియ‌ర్ కామ్రెడ్ ద్వారా కామ్రెడ్ బిరుదాంకితురాలై స‌రిలేరు నీకెవ్వ‌రులో అర్ధ‌మ‌వుతోందా! అంటూ ప్రేక్ష‌కుల‌ను చ‌క్కిలిగింత‌లు పెట్టి.. ఇలా చెప్పుకుంటూ పోతే చావాతోనూ నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్ కావ‌డంతో.. ఆమె నెక్స్ట్ లెవ‌ల్ అన్న పేరు సాధించారు.

అలాంటి ర‌ష్మిక‌తో లైగ‌ర్, కింగ్ డ‌మ్ వంటి విరుస ప‌రాజ‌యాలు ఎదుర్కుంటున్న ఈ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ తో నిశ్చితార్ధం వ‌ర‌కూ వ‌చ్చింది ఆమె ప్రేమ వ్య‌వ‌హారం. ఈ నిశ్చితార్ధ‌మైనా ర‌ష్మిక జీవితంలో క‌ళ్యాణ  గ‌డియ‌లు తీస్కురావాల‌ని.. పీపీపీ డుండుండుం మోత మోగించాల‌ని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ విజ్-ర‌ష్. పెయిర్.. హ్యాపీ మేరీడ్ లైఫ్!!!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు

  సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు కఠిన శిక్ష విధించడం అటు పాకిస్థాన్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది.  ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పులు వెలువరించడం గమనార్హం. 2021 మే నెలలో సౌదీలో ఇమ్రాన్ పర్యటించారు. 2021 మే నెలలో సౌదీ అరేబియా పర్యటించిన సందర్భంగా యువరాజు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఖరీదైన ‘బల్గరి’ నగల సెట్‌ను బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ ఖాజానాకు అప్పగించకుండా ఇమ్రాన్ అతని భార్య బుష్రా సొంత ప్రయోజనం కోసం తక్కువ ధరకు విక్రయించినట్లు వచ్చిన ఆరోపణపై కేసు నమోదైంది.  ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ సంచలన తీర్పు ప్రకటించారు. ప్రధాని హూదాలో ఉంటూ నమ్మకద్రోహానికి పాల్పడినందుకు పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 కింద 10 ఏళ్లు కఠిన శిక్ష, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద 7 ఏళ్లు సాధారణ శిక్ష విధించారు. అంతేకాదు దంపతులకు చెరో రూ.16.4 మిలియన్ జరిమానా కూడా విధించారు. ఈ తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ మరో పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ తీర్పును హై కోర్టులో సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ తరుపు న్యాయవాది తెలిపారు.

ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశాన్ని అందించారు : సీఎం రేవంత్‌రెడ్డి

  ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు.  తెలంగాణలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. సోనియాగాంధీ కూడా ఇదే నెలలోనే జన్మించారు.  ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ అన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చింది. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నాం.  ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా 50లక్షల మంది పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04లక్షల కోట్లు ఖర్చు పెట్టాం.ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా ఏసు ప్రభువు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో  7వేల చర్చిలకు  రూ.30వేల చొప్పున క్రిస్మస్‌ వేడుకల కోసం రూ.33 కోట్లు కేటాయించామని మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దీపక్‌ జాన్‌ తెలిపారు. ఈ క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు

  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి శనివారం రోజు నాంపల్లిలోని ప్రజాప్రతి నిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గతంలో తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి విచారణలో భాగంగా సిఎం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావడం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ లో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించా రనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసుతో పాటు తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ వివిధ కారణాలతో సిఎం రేవంత్ రెడ్డి పై కేసులు నమోద య్యాయి.ఈ కేసులన్నీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా పెట్టినవని పేర్కొంటూ, వాటిని కొట్టి వేయాలంటూ ముఖ్యమంత్రి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో కొనసాగుతున్న విచారణకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై తన వాదనలను వినిపించారు.  ముఖ్యమంత్రి హాజరు సందర్భంగా పోలీస్ యంత్రాంగం కోర్టు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన ఈ కేసులపై కోర్టు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సీపీ సజ్జనార్ షాక్

  హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ ఊహించని షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో పెద్ద ఎత్తున బదిలీలు జరగడంతో సంచలనం సృష్టించాయి. ఎస్సై స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు వివిధ ర్యాంకులకు చెందిన అధికారులను టాస్క్‌ఫోర్స్ నుంచి అటాచ్‌మెంట్‌పై ఇతర విభాగాలకు పంపించారు. కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లోనే కొనసాగుతూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిం చాయి. ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. ప్రత్యేకంగా ఒక కేసులో నిందితుడిని తప్పించేందుకు భారీ మొత్తంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. ఈ వ్యవహారం శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చే స్థాయికి చేరిందని భావించిన హైదరాబాద్ సిపి సజ్జనార్, టాస్క్‌ఫోర్స్‌లో సమూల మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ను మరింత పారదర్శకంగా, సమర్థంగా పనిచేసే విభాగంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సీపీ అవినీతి ఆరోపణల పై అంతర్గత విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో టాస్క్‌ఫోర్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమ్మాయిల ఫోటోలతో డాక్టర్‌కి....14 కోట్లు కుచ్చుటోపి

  సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటన కలకలం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ని టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు ముందుగా అందమైన యువతి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి  కంబోడియా నుంచి ఈ మోసానికి పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో ముందుగా ఓ మహిళ పేరుతో నకిలీ ఖాతా ద్వారా డాక్టర్‌కు మెసేజ్ పంపించారు. అందమైన అమ్మాయి దీంతో డాక్టర్ ఆమెతో స్నేహం చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. తాను ఒంటరి మహిళనని, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్న ఆ మహిళ, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో తమ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. ఆ మహిళ మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టగా, లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మరింత డబ్బు పెట్టేలా ప్రోత్సహించారు. చివరకు ఆమె చెప్పిన మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ తన ఇల్లును కూడా అమ్మి మొత్తం రూ.14 కోట్లు పెట్టుబడిగా జమ చేశారు. అయితే ఆ తర్వాత అకౌంట్లలో నుంచి డబ్బు మాయమవ్వడంతో మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ మోసానికి కంబోడియాలో తిష్ట వేసిన చైనీస్ సైబర్ నేరగాళ్లే ప్రధాన కారణమని గుర్తించారు. కంబోడియా నుంచే ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు ఉపయోగించి డాక్టర్‌ను ట్రాప్ చేసినట్లు తేల్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాలుగు మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అకౌంట్లలోకి డాక్టర్ పంపిన డబ్బును జమ చేసి, వివిధ మార్గాల ద్వారా కంబోడియాకు తరలించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.... “చైనీస్ సైబర్ గ్యాంగ్‌లు కంబోడియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, భారత్ నుంచి యువకులను ఉద్యోగాల పేరుతో అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. మన దేశానికి చెందిన వారినే ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతు న్నారని ఏసీపీ ప్రసాద్  తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులు సూచించే యాప్‌లు, లింక్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టవద్దని సైబర్ అధికారులు ప్రజలను హెచ్చరించారు. మోసపో యిన లేదంటే ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రుషికొండకు బోడిగుండు కొట్టి... యోగా దినోత్సవంపై విమర్శలా? : సీఎం చంద్రబాబు

  రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు...ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్, రంగు రాళ్లపై బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి ఆ తర్వాత కంపోస్ట్ తయారీ యార్డును సందర్శించారు.  అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాము. 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి.  గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు...ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.  ఈసారి పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం థీమ్‌గా తీసుకున్నాం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది. సమగ్ర ఆర్ధిక వృద్ధికి దోహద పడుతుంది. వ్యర్థాలు-మురుగు నీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్టింగ్, పారిశుధ్య సేవలు, హరిత ఉత్పత్తులు, సర్క్యులర్ ఎకానమీ కార్యకలాపాలు...ఇవన్నీ స్థానికంగా ఉపాధి కల్పించేవే.  ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ 2025ను తీసుకువచ్చాం. పొడి, తడి చెత్తను వేరు చేయడంపై చాలామందిలో అవగాహన వచ్చిందని పలువురు పారిశుధ్య కార్మికులు స్వయంగా నాకు చెప్పారు.  వ్యర్థాలను వనరుగా, సంపదగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అసలైన అర్థాన్నిచ్చాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పారిశుధ్య కార్మికులే నిజమైన సైనికులు. అందుకే వారి  గౌరవం పెరిగేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది.  ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1,257జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ  ‘గత పాలకులు చెత్తపై పన్ను వేయడమే కాకుండా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త మొత్తం తొలగించాం. 2026, జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత ఏపీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్ట్ తయారీతో ఏ రోజు చెత్తను ఆరోజు ప్రాసెస్ చేస్తున్నాం. జనవరి 26 నాటికి రాష్ట్రంలో రోడ్డుపై చెత్త అనేది కనపడకూడదు. ఫ్రిబ్రవరి 15 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో   ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేస్తాం. అక్టోబర్ 26 నాటికి పొడి,తడి చెత్త వేరు చేయడం 100 శాతం పూర్తి కావాలి. గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  ఇంటి వ్యర్థాలను కంపోస్ట్ గా తయారు చేసుకొని కూరగాయలు పండించుకోవచ్చు. వీలైనంత వరకూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  వచ్చే ఏడాది అక్టోబర్ 2 తర్వాత ఎక్కడా ప్లాస్టిక్ కనపడకూడదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. త్వరలో మరో 100 ప్రారంభిస్తాం. ప్రతీ ఉమ్మడి జిల్లాకు 6 నుంచి 8 చొప్పున స్వచ్ఛ రథాలు కేటాయిస్తాం.  స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశాక గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇంట్లో చెత్త తీసి రోడ్డుపై వేసే అలవాట్లు మానుకోవాలి. అందరిలో సామాజిక స్పృహ రావాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆర్థికంగా దెబ్బతీశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేశాం. ప్రధాని మోదీ, మిత్రులు పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నాతో సహా నేతలు, కలెక్టర్లు, ఎస్పీలు సహా గ్రామస్థాయి అధికారి వరకు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. అనకాపల్లి జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రపంచమంతా విశాఖ వైపే చూస్తోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారబోతున్నాయి.  ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 610 ఎంవోయూలు కుదిరాయి. SIPB ద్వారా మరో రూ.8.29 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా మొత్తం 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సులో అనకాపల్లి జిల్లాకు సంబంధించి 11 ఎంఓయూలు కుదిరాయి. విశాఖకు గూగుల్ వస్తోంది.  ఇప్పటికే కాగ్నిజెంట్ వచ్చింది. టిసిఎస్ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థ జిల్లాలో పెట్టుబడి పెడుతోంది. రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ సంస్థ ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తోంది. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కు విశాఖ కేంద్రం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. 

నవ దంపతుల మృతి ఘటనలో కొత్త ట్విస్ట్!

  కొత్తగా పెళ్లయిన ఈజంట... ట్రైన్లో సరసాలు ఆడుతూ సరదాగా గడిపారు. సంతోషంగా కనిపిస్తున్న ఈ నవ దంపతుల సంతోషం కొద్దిసేపట్లో ముగిసిపోతుందని ఎవరైనా ఊహించగలరా.... కొన్ని  క్షణాల్లోనే ఆ ఇద్దరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారా ఎవరైనా ఊహిస్తారా... కానీ ఎవ్వరూ ఊహించలేనిది ఆ ట్రైన్ లో ఒక్కసారిగా జరిగేసరికి ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారందరూ ఉలిక్కిపడ్డారు... ట్రైన్ లో నవవరుడు భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ సరదాగా గడుపు తున్న సమయంలో ఈ నవజంట ఒక్కసారిగా అదుపు తప్పి ట్రైన్ నుండి కింద పడిపోయి మృత్యువాత పడ్డారు.  ఇది చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.  ఆ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గం లో చోటుచేసుకున్న విషాదకరమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది .మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా రైల్వే పోలీసులు గుర్తించారు.  ట్రైన్లో ఈ నవ దంపతులు సంతోషంగా ఉన్నా సమయంలో కొందరు వీడియో తీశారు... ఈ నవజంట మృత్యువాత పడిన అనంతరం ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి... ఈ వీడియోలను చూసిన ఇరు కుటుంబ సభ్యులు బోరున వినిపించ సాగారు. ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఈ యువ దంపతులు క్షణాల్లోనే మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.

టీ20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా జట్టు ఇదే.. శుభమన్ గిల్ కు ఉద్వాసన

టి20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించింది. వరల్డ్ కప్ కు ప్రకటించిన జట్టే న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఎంపికయ్యింది.  విశేషమేంటంటే.. టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన శుభమన్ గిల్ కు ఈ జట్టులో స్థానం దక్క లేదు.   ఇలా ఉండగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ లో విఫలమైనా కూడా సూర్యకుమార్ యాదవ్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అంతే కా కుండా అతడినే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్ గాఅక్షర్ పటేల్ ను నియమించారు.   ఇషాన్ కిషన్‌ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. వరల్డ్ కప్ కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, బూమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా,  సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్.

కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా... పవన్ సంచలన వ్యాఖ్యలు

  తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని నన్ను విమర్శించారు. ప్రజల కోసమే తాను సీట్లు తగ్గించుకున్నా అధికారమున్నా లేకున్నా నేను నాలాగే ఉంటా..బెదిరించే నాయకులకు భయపడను. యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు. కాలుకు కాలు, కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు అని పవన్  తెలిపారు. అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములుని సదా  స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశామని పవన్ తెలిపారు.  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం... మీకు  యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్.    ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయిందని పవన్ తెలిపారు. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని తెలిపారు.   కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో చిన్న పిల్లల మధ్య సామాజికవర్గాల పేరిట చిచ్చు పెట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులే లేవా? ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించామని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు ఒప్పించామని ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు తీసుకువస్తున్నామంటే దానికి కారణం ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ. ఆయన సంపూర్ణ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు  అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని తెలిపారు.   

విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా

  విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా  అటల్ బీహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని బండి సంజయ్  ఆవిష్కరించారు. వైజాగ్ అందాలు, ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల అందాలకు మాత్రమే కాదు.. పోరాటలకు ప్రసిద్ది. స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి పోరాటల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేము. అవసరమైతే సముద్రంలా ఉప్పొంగుతారు.  అవకాశలు రావటం ఆలస్యం అయినా ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాకుండా నమ్మకంతో జీవిస్తారు అని బండి సంజయ్ అన్నారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణమైందన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.‘‘అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. వైజాగ్ సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.