Read more!

వేడి టీ వల్ల క్యాన్సర్!

 

 

 

 

చికాగుగా ఉన్నప్పుడు వేడి వేడి టీ తాగితే హాయిగా వుంటుంది అనుకునే వాళ్ళకి " జాగ్రత్త ఎక్కువ వేడి మంచిది కాదు" అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే మరీ పొగలు కక్కే టీ తాగే అలవాటు ఉన్నవారికి ఆహార నాళా క్యాన్సర్ వచ్చే అవకాశం వుందిట. చాలా వేడిగా అంటే 70 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉషోగ్రత గల టీ తాగే అలవాటు ఉన్నవారికి ఈ ప్రమాదం పొంచి వుందట.


ఇరాన్ అధ్యయన బృందం తమ అధ్యాయనంలో భాగంగా ఆహారనాళా క్యాన్సర్ బారినపడిన వారితో పాటు ఆరోగ్యవంతులైన వారి టీ తాగే అలవాట్లనూ పరిశీలించారు. గోరు వెచ్చగా ఉండే టీ తాగే వారితో పోలిస్తే వేడి టీ తాగే వారిలో ఆహార నాళా క్యాన్సర్ ముప్పు రెండింతలు పెరుగుతున్నట్టు తేలిందిట. కాబట్టి మరి పొగలు కక్కే టీ కాకుండా కాస్త వేడిగా వుండే టీ తాగడం అలవాటుగా చేసుకోండి.

....రమ