ప్రముఖులను పరిచయం చేసిన వెంకయ్యనాయుడు
posted on Jun 8, 2014 @ 8:25PM
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభలో వేదిక మీద దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రజలకు పరిచయం చేశారు. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియా, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణసింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్, నాగాలాండ్ ముఖ్యమంత్రి జలన్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖదేవ్ సింగ్ బాదల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, కేంద్రమంత్రి అనంతకుమార్, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా, కేంద్రమంత్రి హర్షవర్ధన్, కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, సోనావాలా తదితరులను వెంకయ్య నాయుడు పరిచయం చేశారు.