ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మటాష్: వెంకయ్య నాయుడు
posted on May 8, 2014 @ 4:47PM
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలుచుకోదని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయమని అన్నారు. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన సందర్భంగా గురువారం నాడు వెంకయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ప్రజలందరూ కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేశారని వెంకయ్య నాయుడు చెప్పారు. సీమాంధ్ర పోలింగ్‌లో కాంగ్రెస్‌కి ఓటు వేసినవాళ్ళుగానీ, కాంగ్రెస్ గురించి పట్టించుకున్నవాళ్ళు కానీ కనిపించలేదని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.