మైలవరంలో గెలుపు దిశగా తెలుగుదేశం
posted on Jun 4, 2024 @ 12:25PM
మైలవరంలో తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుంచీ ఆధిక్యత కనబరుస్తున్నారు. 15 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి వసంత కృష్ణ ప్రసాద్ 20 వేల 442 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
రౌండ్ల వారీగా వసంత కృష్ణ ప్రసాద్ కు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మెదటి రౌండ్ లో 1034, రెండవ రౌండ్.... 79, మూడవ రౌండ్.... 585, నాలుగవ రౌండ్.....298, ఐదవ రౌండ్ .... 21, అరో రౌండ్....504, ఏడో రౌండ్... 2857, ఎనిమిదో రౌండ్.... 2416, తోమ్మిదో రౌండ్... 354, పదో రౌండ్...1023, 11 వ రౌండ్.... 1511, 12 వ రౌండ్...3693, 13 వ రౌండ్...1414, 14 వ రౌండ్... 1871, 15 వ రౌండ్ ... 2941