వరుణ్ ఆరున్నరడుగుల అందగాడు
posted on Feb 27, 2014 @ 3:39PM
మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పరిచయ చిత్ర ప్రారంబోత్సవం రామానాయుడు స్టూడియోలో చిత్ర పరిశ్రమ పెద్దల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సినిమా ప్రారంభానికి దర్శకుడు వినాయక్ గౌరవ దర్శకత్వం వహించగా, కేంద్రమంత్రి చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ను లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ...వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడు కాదని...ఆరున్నరడుగుల అందగాడని కితాబిచ్చారు. మెగా అభిమానుల అండదండలు వరుణ్ తేజ్ కి ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ తరువాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రమిది. వరుణ్ తేజ్ పరిచయ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధర్మ తేజ, రాఘవేంద్రరావు, సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు.
VJ!