వామనరావు ఆడియో కలకలం!
posted on Feb 28, 2021 @ 11:59AM
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇప్పటికే వామనరావుతో పాటు హత్య కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు సంబంధించిన ఆడియో కాల్స్ లీకై వైరల్ గా మారాయి. ఆడియో సంభాషణల్లో కీలక అంశాలు బయటికి వచ్చాయి. తాజాగా హత్యకు గురైన అడ్వకేట్ వామనరావుకు సంబంధించిన ఓ ఆడియో కాల్ బయటకి వచ్చి కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి. మంథని ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై వామన్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తనను శ్రీధర్ బాబు అవమానపర్చాడని వేరే వ్యక్తితో వామన్ రావు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. 20 ఏండ్లుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని అన్నారు. వానికి నీతి లేదు (శ్రీధర్ బాబుకు).. శరణు శరణు అంటూ శ్రీధర్ బాబు వేడుకున్నాడని, ఆయనకు ఆ పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావుకామెంట్ చేశారు. తన కెపాసిటీ ఎంటో చూపిస్తానంటూ ఆయన అన్నారు. జిందగీలో నేను వారి కుటుంబంతో చేతులు కలపను అంటూ ఆడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.