లోయలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు
posted on Jun 26, 2025 @ 10:00AM
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ వద్ద అలకనంద నదిలో ఓ బస్సు పడిపోయింది.ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ఇంకా, 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు కొందరిని రక్షించారు