యు.పి. రాజ్‌భవన్ దగ్గర కారులో బాంబులు
posted on Feb 14, 2015 @ 4:54PM
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ నివసించే రాజ్‌భవన్‌లోకి మూడు బాంబులున్న కారును తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని గ్రహించి కారును నిలిపివేసి, డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో మూడు నాటు బాంబులు వున్నాయి. రాజ్‌భవన్ ప్రవేశ ద్వారం దగ్గరే కారును ఆపేశారు. ఈ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఉత్తర ప్రదేశ్‌లోని మోహన్‌లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన రంజిత్ శర్మ అని పోలీసుల విచారణలో తేలింది. అయితే డ్రైవర్ చెబుతున్న కథనం ప్రకారం.. ఈ కారు అద్దెలకు తిరిగే కారు.. రెండ్రోజుల క్రితం ఒక పెళ్ళి బృందం వారు అద్దెకు తీసుకున్నారు. వాళ్ళు ఆ కారులో మందుగుండు సామగ్రిని తరలించారు. ఆ సామగ్రిలోని బాంబులు కొన్ని కారులో పడిపోయి వుంటాయి. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతానికి నాటుబాంబులు దొరికాయనే ప్రకటించారు. దొరికింది దీపావళి బాంబులని తర్వాత ప్రకటిస్తారేమో!