ఉత్తర ప్రదేశ్‌లో మరో అత్యాచారాల పర్వం
posted on Jun 7, 2014 @ 3:26PM
ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం యు.పి.లో అక్కాచెళ్లపై అత్యాచారం చేసి, ఆపై చెట్టుకు ఊరేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృప్టించింది. అత్యాచార సంఘటనలు సృష్టించిన సంచలనం కంటే అత్యాచారాల మీద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తున్న తీరు ఇంకా సంచలనాత్మకం అయింది. ఇదిలా వుంటే, అక్కాచెల్లెళ్ళ అత్యాచార ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే, యు.పి.లో మళ్లీ అటువంటి ఘటనే జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఇటా జిల్లాలోగల సియపూర్ గ్రామంలో 14, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. వీరిద్దరిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సమీపంలో వున్న అటవిప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ముగ్గరినీ అరెస్టు చేశారు.