నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కింజారపు
posted on Jul 17, 2024 @ 2:50PM
శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రం నియమించింది.
కేంద్రంలో మోడీ సర్కార్ ముచ్చటగా మూడో సారి కొలువుదీరిన తరువాత నీతి ఆయోగ్ కూర్పును మార్చింది. ఆ మార్పులో భాగంగా కేంద్ర మంత్రి, తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించింది. అలాగే ఎక్స్‌అఫీషియో సభ్యుల కేటగిరిలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను చేర్చారు.
ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కింజారపు రామ్మోహన్ నాయుడితో పాటు మంత్రులు జేపీ నడ్డా, హెచ్‌డీ కుమారస్వామి, జితన్‌రాం మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, జూయెల్ ఓరం, అన్నపూర్ణాదేవి., చిరాగ్ పాస్వాన్ ను నియమించారు.