అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న బాలికలు!
posted on Jun 9, 2014 @ 4:40PM
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాలకు నిలయంగా మారిపోయింది. రోజు మార్చి రోజు అత్యాచార వార్తలను వినాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సోమవారం నాడు యుపిలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు దళిత బాలికలు తమమీద జరిగిన అత్యాచార యత్నం నుంచి తప్పించుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మైన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా దాబ్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఈ ఇద్దరు బాలికలు బయటకి వెళ్ళినప్పుడు ఇద్దరు యువకులు వీళ్ళని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారిని తీవ్రంగా ఎదుర్కొన్న బాలికలిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆ బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అత్యాచారాల రాజ్యంగా మారిపోయిన ఉత్తర ప్రదేశ్‌లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఇద్దరు బాలికలు అదృష్టవంతులే.