నాగాలాండ్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్ల కిడ్నాప్
posted on Jul 29, 2014 @ 12:35PM
నాగాలాండ్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు ఇంజనీర్లు కిడ్నాప్ అయ్యారు. వీరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగాలాండ్‌లో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న పృథ్వి కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు గోగినేని ప్రతీష్ చంద్ర, రఘులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈశాన్య రాష్ట్రాలలో కాంట్రాక్ట్ పనులు చేసే సంస్థలకు చెందిన ఉద్యోగులను తీవ్రవాదులు కిడ్నాప్ చేయడం, వారిని విడిచిపెట్టాలంటే భారీగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈమధ్యకాలంలో సాధారణంగా మారింది. కొద్ది నెలల క్రితం అస్సాం రాష్ట్రంలో నాగమల్లేశ్వరరావు అనే ఇంజనీర్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి, వారికి ముట్టవలసినవి ముట్టిన తర్వాత ఆయనని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా నాగాలాండ్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లు కిడ్నాప్ అయ్యారు.