ట్వీటర్ వేదికగా కన్నా, విజయసాయిల మాటల తూటాలు!
posted on Apr 20, 2020 @ 4:34PM
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అసలు సమస్యల నుంచి నుంచి పక్కకు తప్పించేలా వైసిపి, బిజెపి బిజెపి మధ్య ట్విట్టర్ లో వార్ నడుస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. కన్నా టీడీపీకి అమ్ముడుపోయారన్న విజయసాయి అంటున్నారు. ఆయన పాపం పండిందన్న బీజేపీ చెబుతోంది.
బీజేపీ వైసీపి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కన్నా లక్ష్మీనారాయణ కరోనా కిట్లపై చేసిన ట్వీట్‌తో ఈ హీట్ మరింత పెరిగింది. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
కరోనా కిట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ కిట్లలో కూడా కమీషన్ కొట్టారా.. 'మన పక్కరాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనా కిట్లను దక్షిణకొరియా నుండి కేవలం రూ. 337+GSTకి కొన్నారు. మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారంటూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలతోనే రాజకీయంగా దుమారం రేగింది.
నా పట్ల నువ్వు చేసిన నిరాధారమైన ఆరోపణలపై కాణిపాకంలో సత్యప్రమాణానికి నేను సిద్ధం, నువ్వు మాట మీద నిలబడే మనిషివి ఐతే వచ్చి ప్రమాణం చెయ్యి. నీ వ్యాఖ్యలకు పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండు. కిట్ల రేటుపై నేను ప్రశ్నించడం వల్లే వాటి రేటు బయటకు తెలిసి తక్కువ ధరకు ఇవ్వడం నిజం కాదా? అంటూ కన్నాలక్ష్మీనారాయణ ట్వీట్ చేస్తూ విజయసాయిరెడ్డిపై విరుచుకు పడ్డారు.
దేశవ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నా లాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్న వారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వారు కన్నా లాంటి జంబూకాలను వదిలించుకోవాలంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ కూడా గట్టిగా తిప్పికొట్టింది. ఈసారి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాకుండా.. పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాస్త కళ్ళ జోడు తుడుచుకుని పెట్టుకుని చూడండి ఇది ఏపీ బిజెపి. కరోనా వచ్చి రాష్ట్రం ఇప్పడు క్వారంటేయిన్లో ఉంటే తము చేసిన పనులకు 2012లోనే మీరు క్వారంటేయిన్లో ఉన్నారు. ఈ కిందివి మీ డిగ్రీలు కాదు తమరి నేర ఘనతలు. పైత్యంతో ఉన్న కొద్ది పరువునూ తీసుకోకండి సూట్ కేసు రెడ్డి... అంటూ ఏపి బిజెపి నేతలు ట్వీట్ చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని.. టీడీపీ మాజీ నేత, ఎంపీ సుజనా చౌదరి ద్వారా డీల్ జరిగిందని విమర్శించారు. సుజనా చౌదరి మధ్యవర్తిత్వం నిర్వహించి చంద్రబాబు, కన్నాను కలిపారని.. అందుకే చంద్రబాబు తరహాలోనే కన్నా కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. మళ్లీ అడుగుతున్నా... కన్నా! మీరు సుజనాకు అమ్ముడు పోయారా? లేదా? టీజేపి (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజీపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తానంటూ ట్వటర్‌లో విజయసాయి రెడ్డి స్పందించారు.
ఈ మధ్య మాటల యుద్ధం లాక్‌డౌన్‌లో వున్న ఏపీ జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోందట. మరికొద్ది రోజుల పాటూ ఇలాగే కొనసాగి రాజకీయ నేతలకు సంబంధించిన అసలు విషయాలు అన్నీ బయటికి వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.