స్టూడెంట్ తో శోభనం.. లేడీ టీచర్ దారుణం..
posted on Mar 18, 2021 @ 4:18PM
రాజకీయాల్లో రాజయోగం దక్కాలంటే 13 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఆ వృద్ధ రాజకీయ నాయకుడు 13 ఏళ్ళ బాలికను పెళ్లి చేసుకునే సీను రంగం సినిమాలో చూసే ఉంటారు. మూఢ నమ్మకాలను నమ్మేవాళ్లున్నంత కాలం ఇలాంటి తప్పులకు తలుపులు తెరుచుకుంటాయి. అక్షరం రాని వాళ్లు మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు బుద్ది గడ్డి తింటుంది. అలాగే విద్యాబుద్ధులు నేర్పే ఓ ట్యూషన్ టీచర్ బుద్ధి కూడా గడ్డి తిన్నది. జన్మకుండలిలో దోషం తొలగిపోతుందనే నమ్మకంతో 13 ఏళ్ల బాలుడిని ఓ టీచరమ్మ పెళ్లి చేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ ఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జలంధర్‌లోని బస్తీ భవ ఖేల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంట్లోనే ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ యువతికి ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో.. ఆమె కుటుంబం కూతురుకి పెళ్లి కావడం లేదన్న బెంగతో ఓ పూజారిని కలిసింది. ఆ యువతి జాతకాన్ని పరిశీలించిన పూజారి.. మీ అమ్మాయి జన్మకుండలిలో దోషం ఉందని, ఆ దోషం తొలగిపోవాలంటే ఓ బాలుడితో పెళ్లి తంతు జరిపించాలని సూచించాడు. సదరు యువతి ఇలాంటివన్నీ నమ్మొద్దని తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సింది పోయి ఆమె కూడా పూజారి చెప్పినట్టుగానే చేసింది.
ఆమె ట్యూషన్‌కు వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని ఈ ఉత్తుత్తి పెళ్లికి వరుడిగా ఎంపిక చేసుకుంది. వారం రోజుల పాటు మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉండాలని.. క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ బాలుడి తల్లిదండ్రులకు ఈ టీచరమ్మ చెప్పింది. అనుకున్నట్టుగానే.. ఆ బాలుడిని వరుడిగా కూర్చోబెట్టి అతనితో ఈ టీచరమ్మ మూడు ముళ్లు వేయించుకుంది. అయితే.. ఈ పెళ్లి గురించి అంతా రహస్యంగా ఉంచడంతో ఎవరికీ తెలియలేదు. ఆ బాలుడికి కూడా ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఇంటికి వారం రోజుల తర్వాత ఇంటికి పంపారు.
ఆ బాలుడు ఇంటికెళ్లి జరిగిన బాగోతమంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు బస్తీ భవ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఉత్తుత్తి పెళ్లయినప్పటికీ పెళ్లిలో జరిగే హల్దీ-మెహిందీ వేడుక, పెళ్లి తర్వాత శోభనం రాత్రి తంతు కూడా పూర్తి చేశారని తేలింది. ఆ తర్వాత.. ఆ టీచర్ గాజులు పగులగొట్టి ఆమెను విధవగా ప్రకటించారని తెలిసింది. ఇలా చేస్తే.. దోషం తొలగిపోయి ఆమెకు పెళ్లి కుదురుతుందని ఆ పూజారి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. తొలుత.. బాలుడి తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీచరమ్మ ఒత్తిడితో తర్వాత కేసు ఉపసంహరించుకున్నారు.