సమైక్య నినాదంతోనే తెలంగాణాలో గెలుస్తా: జయప్రకాష్ రెడ్డి

 

కాంగ్రెస్ పార్టీలో, సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నతెలంగాణా కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు తూరుపు జయప్రకాశ్ రెడ్డి మాత్రమే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అవసరం లేదని వాదిస్తున్న ఒకే ఒక తెలంగాణా వ్యక్తిగా నిలిచేరు. అంతటితో ఆగక వచ్చే ఎన్నికలలో సమైక్య వాదంతోనే తానూ తన నియోజక వర్గంనుండి గెలిచిచూపిస్తానని, దమ్ముంటే తనని తెలంగాణా వాదంతో ఓడించమని, ఒకవేళ తానూ గనుక ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కేసిర్ కి అయన సవాలు విసిరేరు. కేసిర్ కే గనుక దమ్ముంటే, మతతత్వ పార్టీ అయిన యం.ఐ.యం.ని తెలంగాణాకి అనుకూలంగా ఒప్పించాలని మరో సవాలు విసిరారు. తెలంగాణావాదాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు పోగేసుకోన్నాడని కేసిర్ ని విమర్శించారు.


కాంగ్రెస్ ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ప్రకటించే బదులు, తెలంగాణా అభివృద్ధి బోర్డుని స్థాపించి దానికి రూ.10,000 కోట్లు ఇచ్చినట్లయితే తెలంగాణా ఇంకా త్వరితగతిన అభివృద్ధి సాదించగలదని ఆయన తెలిపారు. చేవెల్ల-ప్రాణహిత ప్రాజెక్టులు పూర్తీ చేసినట్లయితే తెలంగాణాలో పలుజిల్లాలు సస్యశ్యామలమవుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు.

Teluguone gnews banner