టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ తో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం...
posted on Oct 4, 2019 @ 5:07PM
టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ తో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. త్రిసభ్య కమిటీ రెండు రోజులుగా చెప్పిందే మళ్లీ చెప్పింది కానీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి అన్నారు. సమ్మెను వాయిదా వేసుకోమని, త్వరలోనే రిపోర్ట్ ఇస్తామని కమిటీలో అన్నారని ఆయన అన్నారు.
అయితే ఏ విధమైన రిపోర్ట్ ఇస్తారు, అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారా లేక ప్రతికూలంగా ఇస్తారా అన్న దానిపై రాత పూర్వక హామీ ఇవ్వమని అడిగితే అవన్నీ చెప్పడం కుదరదని మీరు వాయిదా వేసుకోమని కమిటీ చెప్పడం జరిగిందని అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ బతుకు కోసం చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె లో ఆర్టీసీ కార్మికులంతా భయం లేకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు.
సమ్మె నుంచి సెక్యూరిటీ, పారా మెడికల్ విభాగాలను మినహాయించాలన్నారు. సర్కారు, ఆర్టీసీ సంఘాల మధ్య చర్చలు విఫలమయ్యాయి దీంతో పండుగ ముందు ప్రజలకు ఆందోళన మొదలైంది. సొంతూళ్లకు వెళ్ళి పండుగ జరుపుకుందామని అనుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే సమ్మె జరిపేటప్పుడు దానికి కావలిసిన బందోబస్తు అంతా కూడా కమిటీ ఏర్పాటు చేసింది. మనం ప్రజలకు సేవ చేస్తున్నామని వారికి ఇబ్బంది కలిగించకుండా సమ్మె నిర్వహించాలని కమిటీ ఆదేశించింది. ముందు పండుగ వస్తుందనీ పండుగ జరుపుకునే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమ్మెలు జరుపుకోవాలని కమిటీ ఆర్టీసీ సంఘాలను కోరింది.