ఆర్టీసీ సమ్మె పై ఈ నెల ఇరవై తొమ్మిదిన కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది?
posted on Oct 22, 2019 @ 12:09PM
సెప్టెంబర్ నెల వేతనాలు అందుతాయని ఆశపడ్డ కార్మికులకు ఆర్టీసీ సంస్థ మొండి చెయ్యి చూపించింది ప్రభుత్వం. జీతాలకు నిధులు లేవని ఆర్టీసీ యాజమాన్యం చెప్పడం పై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అటు సమ్మె విషయంలో ప్రభుత్వం తీరు పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించడానికి సరిపడ నిధులు లేవని సంస్థ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ హై కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కార్మికుల జీతాలకు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అవసరమని ప్రస్తుతం సంస్థ ఖాతాలో సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రతి నెలా కార్మికుల జీతాల కోసం ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ఆదాయ వనరులు లేక పోవడంతో జీతభత్యాల కోసమే పీఎఫ్ సీసీఎస్ నిధులు వినియోగించుకున్నట్టు తెలిపారు. కార్మికులు సెప్టెంబర్ నెల జీతాల కోసం ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శికి హనుమంతు మరొకరు హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిగింది.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది.ఆర్టీసీ ఆదాయం రోజుకు పది కోట్లని పండుగ రోజుల్లో పదమూడు కోట్లుంటుందని ఏఏజీ రామచంద్ర రావు వాదించారు. కార్మికులు సరిగ్గా దసరా పండుగకు ముందు సమ్మెకు దిగడంతో నూట ఇరవై ఐదు కోట్ల నష్టం వచ్చిందన్నారు.ఆర్టీసీ వార్షిక వ్యయం ఐదు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు కాగా ఆదాయం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అని ప్రస్తుతం ఆర్టీసీ ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల నష్టాల్లో ఉందని వినిపించారు. ఏటా పన్నెండు వందల కోట్ల నష్టాలు వస్తున్నాయన్నారు. రాబడి లో యాభై ఎనిమిది శాతం జీతాలకే వినియోగిస్తున్నారని, రెండు వేల పదిహేనులో నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ తో సంస్థ పై తొమ్మిది వందల కోట్లు, రెండు వేల పదిహెడులో పదహారు శాతం తో రెండు వందల కోట్ల భారం పడిందని రామచంద్రారావు వాదించారు.అయితే కార్మికుల వేతనాలకు సంబంధించి కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తుందని పిటిషనర్ల తరపు లాయర్ వాదనలు వినిపించారు.ఆర్టీసీ అధికారులకు వంద కోట్ల మేర వేతనాలు చెల్లించిందని కార్మికులకు ఇవ్వాల్సింది నూట నలభై కోట్ల అన్నారు. కార్మికులు సమ్మె చేస్తున్న డెబ్బై శాతానికి పైగా బస్సులనూ తిప్పుతున్నామని తెలిపారు. ఈ లెక్కన సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్ లు కండక్టర్ ల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో ఎక్కడా చెప్పలేదని అన్నారు. అటు ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళ సాయిని కలిశారు చర్చలకు ఆహ్వా నించడం అద్దె బస్సులను తీసుకునే విషయం పై ప్రభుత్వం తో మాట్లాడుతానని ఆర్టీసీ కార్మికులు భయపడొద్దని ఆమె భరోసా ఇచ్చారు కార్మిక యూనియన్ లను చర్చల కు ఆహ్వానించి సమ్మెను విరమింప చేయాలని హై కోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టు కాపీ అంత లేదన్న సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు అద్దె బస్సు లను తీసుకోవడానికి వీల్లేదని ఇరవై ఐదు శాతాని కి మించి తీసుకోవద్దని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వం లాకౌట్ గా ప్రకటిస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. అలా ప్రకటించటానికి సీఎం ఎవరని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు ఆస్తి అని దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఒక వెయ్యి ముప్పై ఐదు అద్దె బస్సుల కోసం టెండర్ లు పిలవడం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచనలో భాగమేనని ఆరోపించారు.అటు పిటిషన్ పై విచారణ వాయిదా పడటంతో జీతాల కోసం కార్మికు లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల ఇరవై తొమ్మిది న కోర్టు ఏం చెబుతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.