టీఆర్ఎస్ ఖాతాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు
posted on Dec 11, 2015 @ 1:25PM
తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్ఠానాలకు గాను పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో అప్పుడే మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. దీనిలో నిన్న టీఆర్ఎస్ పార్టీ ఒకటి బోణి కొట్టింది. వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి గాను కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు రెండు స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి రియాజ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాదు నారాయణరెడ్డి టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి భూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.