మేనమామే కోడలిపై
posted on Mar 19, 2021 @ 10:12AM
గొర్రె కసాయిని నమ్మినట్లు అమ్మాయి మేనమామను నమ్మింది. తల్లి లేని తనకు మేనమామ సంరక్షకుడిగా ఉంటాడనుకుంది. కానీ మామ మాత్రం కోడలితో కామ వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఇక అంతే మామ పథకం వేశాడు. నేషినల్ అవార్డు కోసం ట్రే చేసే యాక్టర్ కంటే ఎక్కువ యాక్ట్ చేసి. కోడలిని బలవంతంగా అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైన చెపితే చెంపేస్తాను అని బెదిరించాడు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో మైనారిటీ వర్గానికి చెందిన బాలిక తల్లితో కలిసి నివాసముండేది. అయితే.. ఇటీవలే ఆ బాలిక తల్లి మృతి చెందడంతో ఆమె బాగోగులు చూసుకునే వారే కరువయ్యారు. తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఆ బాలికను వెతుక్కుంటూ మేనమామ వరుసయ్యే ఆసీఫ్ ఆమె ఇంటికొచ్చాడు.
ఒంటరిగా మిగిలిన ఆ బాలిక బాగోగులను ఆసీఫ్ చూసుకునేవాడు. అయితే.. అతనిలో మేలేగా పాడుబుద్ధి పుట్టింకొచ్చింది ఆ బాలికపై ఆసీఫ్ కన్ను పడింది. ఆమెకు తనంటే నమ్మకం కలిగేలా కొన్నిరోజులు నటించాడు. ఆసిఫ్ రానురాను తన నీచబుద్ధి బయటపెట్టసాగాడు. ఓదార్పు నెపంతో ఆమెను అక్కున చేర్చుకుని ఎక్కడెక్కడో తాకేవాడు. ఆ బాలిక మేనమామే కదా తండ్రి లాంటోడనుకుంది. రెండు రోజుల క్రితం గేమ్ ప్లాన్ చేసి కోడల్ని టౌన్‌కు వెళ్దామని నమ్మించిన ఆసిఫ్ కామారెడ్డి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కోరింది కొనిచ్చాడు. ఆమె ఏం తినాలని కోరుకుందో అన్నీ తీసుకొచ్చి పెట్టాడు.
మేనమామ కద అని నమ్మడమే ఆ బాలిక చేసిన పాపమైంది. ఆమె పూర్తిగా నమ్మిన క్రమంలోనే.. ఆసిఫ్‌లోని కరుణ చచ్చిపోయి కామాంధుడు నిద్రలేచాడు. ఆమెను కామారెడ్డిలోని ఓ రహస్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు. తన వాంఛ తీర్చాలని ఆమెను కోరాడు. ఆ బాలికకు ఆసిఫ్ దురాలోచన అర్థమైంది. అందుకు ఏమాత్రం ఒప్పుకునేది లేదని ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో.. ఆ బాలికను బంధించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే.. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆసిఫ్ ఆమెను గంభిరావుపేటలో వదిలేసి వెళ్లాడని ఆయన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ పేర్కొన్నారు. బంధువని నమ్మిన అమ్మాయిని అత్యాచారానికి పాల్పడి ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఇలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయి బంధువు బాబా డిమాండ్ చేశారు.