తుగ్లక్ సీఎం.. సాయం ప్లీజ్.. ఖిల్లాపై టీడీపీ జెండా.. గంభీర్ కు గండం.. టాప్ న్యూస్@1PM
posted on Nov 24, 2021 @ 12:06PM
ఏపీ శాసనసభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి. ప్రజల్లోకి వెళ్దాం అని చంద్రబాబు అన్నారు. భారీగా వర్షాలు వస్తాయని తెలిసినా ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం జరిగేదా? అని ప్రశ్నించారు చంద్రబాబు. వరద బాధితులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.
--------
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన పొందుపరిచారు. భారీ వర్షాలతో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని లేఖలో తెలిపారు సీఎం జగన్.
----
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు
-----
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ స్పెషల్ డిష్ ను పరిచయం చేశారు. విశాఖపట్నంలో చిట్టెం సుధీర్ అనే యువకుడు చిన్న తోపుడు బండి ద్వారా తయారు చేస్తున్న టేస్టీ టేస్టీ స్పెషల్ ఇడ్లీని జనానికి తెలియజేశారు. రాగి, ఇతర సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని సూచించారు.
---------
పశ్చిమ గోదావరి జిల్లా... ద్వారకా తిరుమలలో జోరుగా పందుల పందాలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసు క్వార్టర్స్ వెనుక భాగాన జోరుగా పలువురు పందాలు నిర్వహిస్తున్నారు. రామన్నగూడెం, ద్వారకా తిరుమలకు చెందిన పందుల మధ్య పోటీలు జరుగుతున్నాయి. పందేలపై జోరుగా బెట్టింగ్‌లు సైతం కొనసాగుతున్నాయి
----------
తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో తెలంగాణ సిఎం కేసీఆర్ సేద తీరుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ సిఎం కేసీఆర్ డిల్లీ పర్యటన.. టిఆర్ఎస్, బిజేపి రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.ఈ తీర్థ యంత్రాల తో రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---
ఏడేండ్లలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్ మాత్రమేనని.. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగాల భర్తీపై ఉన్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైన్సుల ఏర్పాటుకు మాత్రం పుంఖానుపుంఖాలుగా టెండర్లు, ఉద్యోగాల భర్తీపై మాత్రం పెదవి విప్పడం లేదన్నారు. నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా దొరగారికి సోయి రావడం లేదని షర్మిల మండిపడ్డారు.
-----
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ జిల్లా జడ్జి.. సర్వోన్నత న్యాయస్థానం ముందే నిరసన తెలిపారు. అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. మెయిన్ గేటు దగ్గర ఓ వ్యక్తి అర్ధనగ్నంగా కూర్చోవడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది.. ఆయన దగ్గరకు వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. నిరసనను ఆపాల్సిందిగా కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. జడ్జి చాలా సేపు అక్కడే కూర్చున్నారు. చాలాసేపు బతిలాడిన తర్వాత ఆయన చొక్కా వేసుకున్నారు.
-
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మురుడేశ్వర్‌పై ఐసిస్ ఉగ్రవాదుల కన్ను పడినట్టు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆలయ పరిసరాలలో భద్రతను పెంచారు. అరేబియా సముద్రానికి సమీపంలో ఉన్న హిందువుల అత్యంత పవిత్రస్థలమైన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ్ తాలూకాలోని మురుడేశ్వర్‌కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు, భక్తులు విచ్చేస్తుంటారు.
----
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌కు ఈమెయిళ్ల రూపంలో బెదిరింపులు వచ్చాయి.దీంతో కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.