బాధితులకు బాబు భరోసా.. జగనన్న మరో బాదుడు.. కొండపల్లి రచ్చ.. టాప్ న్యూస్@1PM
posted on Nov 23, 2021 @ 11:44AM
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాధితులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో ఆయన తిరుగుతున్నారు. చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మఖ్య నేతలు ఉన్నారు. అంతకుముందు కడపకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.ఎయిర్‌పోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
-----
వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నానన్నారు. పంచాయతీల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేశారని లోకేష్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే అని మండిపడ్డారు.
--------
ఏపీ అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై ఆసక్తికర చర్చ జరిగింది. కందుకూరులో ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్లు లేకుండానే క్లైమ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహిధర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ అలా అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
---
ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది జగన్ రెడ్డి. మోటారు వాహనాల పన్ను చట్టం 1963లో సవరణలకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. కొత్త చట్టం ద్వారా నూతన వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో... ఇకపై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించబోతోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21లో రవాణా శాఖకు రూ. 3,181 కోట్ల ఆదాయం లభించింది. టాక్స్‌ల పెంపుతో లక్షల మందిపై వందల కోట్ల భారం మోపనుంది.
-----
కొండపల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కొండపల్లి ఇబ్రహీంపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేష్ మకాం వేశారు. టీడీపీ శ్రేణుల మీద దాడులు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇబ్రహీంపట్నంలో వాహనాల్లో కర్రలు వేసుకుని వైసీపీ నేతలు హల్ చల్ చేస్తున్నారు.
----
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నిర్ణయమే తమ నిర్ణయం.. పార్టీ నిర్ణయమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్టణానికి పర్యాటక రంగంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదన్నారు.
-----
జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో బీజేపీ మెరుపు ధర్నాకు దిగింది. మేయర్ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసుకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బల్దియాకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. మేయర్ హఠావో అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్ చాంబర్‌లో ఫర్నీచర్‌ను బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-----
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామీ వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. కాగా... ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటీషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు
----
మెట్రోరైలు నడుస్తున్న సమయంలో ఆయా స్టేషన్ల మూల మలుపుల వద్ద వస్తున్న శబ్దాలతో ప్రయాణికులు కంగారుపడుతున్నారు. అప్పటివరకు సాఫీగా నడుస్తున్న రైలు కింది భాగంలో సౌండ్ వస్తుండడంతో ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడిందోననే భయంతో వణికిపోతున్నారు. బేరింగ్‌లు అరిగిపోయిన శబ్దాలు వినిపిస్తుండడంతో ప్రయాణికులు, రోడ్లపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా నాంపల్లి, అసెంబ్లీ, బేగంపేట్, రసూల్‌పురా, ప్రకాష్‌నగర్, ఎంజీఆర్‌ఐ, తదితర ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
---
గత పది వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రోడ్లపై వరదనీరు పారుతుండటంతో కార్లు తేలియాడుతున్నాయి. యలహంక చెరువు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొగిలు క్రాస్, నాగవర, విద్యారణ్యపుర, యెలహంక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. వరద ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయ పనులు చేపట్టారు.