తిరుమలలో పెరుగుతున్న రద్దీ
posted on Sep 28, 2020 @ 10:24AM
నిన్న ఒక్కరోజే హుండీ కలెక్షన్ 2.34కోట్లు
కరోనా కారణంగా స్తంభించిపోయిన ప్రజాజీవనం మెల్లమెల్లగా కరోనాతో సహవాసానికి అలవాటు పడుతుంది. లాక్ డౌన్ లతో ఇంటికే పరిమితమైనా కరోనా మహ్మమారి విజృంభన ఏ మాత్రం తగ్గకపోవడంతో క్రమంక్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నెలల తరబడి మూతపడిన ఆలయాలు తెరుచుకోవడంతో సందర్శకుల సంఖ్యనానాటికీ పెరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. దాంతో తిరుమల తిరుపతిలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయంక్రమంగా పెరిగింది. ఆదివారం ఒకరోజే 12వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2.34కోట్ల రూపాయలు వచ్చింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతిలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయంక్రమంగా పెరిగింది. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ టైమ్ ఇంత ఆదాయం వచ్చినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నెలలో దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయగా, ఇప్పటికే అన్ని అయిపోయాయి.
లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత రవాణా సదుపాయాలు ఎక్కువగా లేకపోవడంతో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. చాలావరకు సొంత వాహనాల్లో వచ్చేవారు మాత్రమే ఏడుకొండస్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం భారీగా పడిపోయి 50లక్షలు మించలేదు. ప్రసుత్తం రవాణా సదుపాయాలు పెరగడంతో అక్టోబర్ లో స్వామివారి దర్శనం కోసం ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకున్నవారి సంఖ్య పెరిగింది. తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అన్న ఆశాభావాన్ని టిటిడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు.