తిరుమలలో అపచారం.. భక్తులు ఆందోళన
posted on May 22, 2025 @ 6:31PM
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు. వెంటనే టీటీడీకి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం శ్రీవారిని అపచారం చేయడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్గమా దాడి నేపద్యంలో ఇలాంటి ఘటనలో తిరుమలలో జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు