బంగారం దొంగ ఈ చిట్టెలుక!
posted on Jun 17, 2022 @ 12:35PM
కుందేళ్లు, ఎలుకలు పగదీర్చుకోవడం జానపదకథల్లో చదివాం. రాకుమారుడికి అతని ప్రేయసి వున్న చోటు పూర్వం ఒక కుందేలే చూపించడం వంటి చందమామ కథలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. అవి నిజంగా జరిగాయో లేదో తెలీదుగాని పాఠకులకు మాత్రం కథ పట్ల ఉత్సాహాన్ని రెట్టింపుచేస్తాయి. ఎలు కలు మద్యం తాగాయి, గోడౌన్లలో బియ్యం తినేశాయన్న కథలూ అప్పుడప్పుడూ పేపర్లలో చదువుతూం టాం. కానీ ఒక ఎలుక నిజంగానే దొంగలా దొరికింది! ఈ దొంగ ముంబాయిలో ఏకంగా బంగారం వున్న కవరుతో దొరికింది!
అసలే బంగారం ఖరీదు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముంబాయిలో ఓ పెద్దావిడ తన వద్ద వున్న బంగా రాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని బయలుదేరింది. దారిలో పిల్లలు ఆడుతూ కనిపించారు. వారికి ఆమె చేతిలో వున్న బ్రెడ్ ఇవ్వాల్సింది పొరబాటున బంగారం వున్న కవర్ ఇచ్చేసింది. పిల్లలు ఆట గోల లో ఆ కవర్‌ని రోడ్డు పక్కన వుండే చెత్త కూపలో పడేయమని ఇచ్చిందేమో అనుకున్నారు. అసలు ఆ కవర్లో ఏముందో కూడా చూడకుండా చెత్తకుప్పలోకి విసిరేసి వెళిపోయారు. అది ముంబయి గోకుల్‌ధామ్ కాలనీ ప్రాంతం. ఆ చెత్తకుప్ప వద్దకు వచ్చిన ఎలుక సరిగ్గా ఆ బంగారం వున్న కవర్‌నే పట్టుకుని కొరికింది. అది ఏదో తినే పదార్ధమనుకున్నది. కొరకబడలేదు..దూరంగా తీసికెళ్లి మరో ప్రయత్నం చేయాలనుకుందో ఏమో ఆ కవర్‌ని నోటితో గట్టిగా మరో పట్టుపట్టి తనవల్ల కాక అక్కడే వదిలేసి పోయింది. పోలీసులు అక్క డికి వచ్చి ఆ బంగారాన్ని రికవర్ చేసుకున్నారు.
ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఎలుక తతంగాన్ని పట్టేసాయి. అది ఇచ్చిన పెద్ద సాక్ష్యంతో పోలీసులు ఈ చిన్ని దొంగ తతంగాన్ని గుర్తించి పరుగున వెళ్లి బంగారం కవర్‌ని పట్టేసారు. పిల్లలే వది లేసిన కవర్‌లో తను పట్టుకున్న కవర్‌లో ఎంతో విలువయిన బంగారం వుందన్న సంగతి దానికి తెలియదు, తెలిసినా వాటి సంగతి దానికి అనవసరం, తినేదయితే ఈపాటికి తినేసేదే. అది కొరుకుడు పడలేదు కాబట్టి వదిలేసి పారిపోయేదే! ఆ చోరీ సత్తు రికవరీ అయింది!