తెలంగాణలో ధియేటర్స్ క్లోజ్?
posted on Mar 24, 2021 @ 11:29AM
సినిమా హాల్స్ మూసేయండి. తెలంగాణ సర్కారుకు వైద్య అధికారుల నివేదిక. ఈ విషయం పై ఎంత ఆలస్యం చేస్తే అంత ముప్పు తప్పదు అంటున్న వైద్యులు. మూసివేత వద్దనుకుంటే ధియేటర్ కెపాసిటీని తగ్గించండి. కేసులు పెరగడానికి సినిమాలు కూడా కారణమే ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు.
జనం ఎక్కడ ఉంటే అదే దాని పెట్టుబడి. ఆ ప్రదేశాలే కరోనా కు పుట్టిన ఇల్లు. కరోనా రోజురోజుకూ కోరలు చేస్తున్నాయి. దేశం లో తెలుగు రాష్ట్రాల్లో కేసులు కుప్పలా పెరుగుతున్నాయి. స్కూల్స్ లో.. హాస్టల్ లో జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కరోనా మహమ్మారి మళ్ళీ తన పాగా వేస్తూ విరుచుకుపడుతుంది. ఒక వైపు పిల్లను స్కూల్ కి పంపాలంటే తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.. మరో వైపు ప్రజల్లో గత సంవత్సరం కింద ఉన్న భయం, ఉప్పెనలా మళ్ళీ స్టార్ట్ అయింది. నేపథ్యంలో తెలంగాణలో స్కూల్స్ కి తాళం వేసింది.. ఇది ఇలా ఉండగా కరోనా వ్యాప్తి చెందడానికి ఎన్నో కేంద్రాలు ఉన్నాయి, వైన్స్ లు, బార్లు, జిమ్ములు, మెట్రో ట్రైన్స్, కోచింగ్ సెంటర్స్, బస్సులు వీటన్నితో పాటు ముఖ్యం గా సినిమా ధియేటర్స్ మరి వీటి మాట ఏమిటి ..? అటు ప్రజల్లోనూ.. ఇటు వైద్యులోను ప్రశ్నలు మెదులుతున్నాయి.
ఇప్పుడు రాష్ట్రంలో రెండో వేవ్ కొనసాగుతోందని గుర్తు చేసిన ఆరోగ్య శాఖ అధికారులు, పరిస్థితి ఇలానే ఉంటే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపూర్ణ లాక్ డౌన్ తర్వాత వరుసగా కొత్త సినిమాలు వస్తుండటంతో, 90 శాతం వరకూ థియేటర్లు నిండిపోతున్నాయని, సినిమా హాల్స్ లో మాస్క్ లు లేకుండా. పక్కపక్కనే కూర్చోవడం, డోర్స్ క్లోజ్ చేసి ఎయిర్ కండిషనింగ్ అమలు చేస్తుండటం వల్ల కూడా కేసులు పెరగడానికి కారణమని అధికారులు తమ నివేదికలో తెలిపారు. సినిమా హాల్స్ తో పాటు ప్రజలు అధికంగా ఉండే వివిధ కార్యకలాపాల ప్రదేశాలపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించామని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన నివేదికను అనుసరించి నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలోనూ ఆరోగ్య శాఖ కొంత అసహనంగానే ఉన్నట్టు సమాచారం. స్కూళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలని తాము పది రోజుల క్రితమే నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నదని అంటున్న అధికారులు, సినిమా హాల్స్ విషయంలో సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని కోరుతున్నారు.