దీపావళికి ఉగ్రముప్పు... ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక
posted on Oct 18, 2019 @ 5:47PM
దేశ రాజధానికి ఉగ్రముప్పు ఉన్నట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీపావళి సంబరాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. దీనితో ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసారు. ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్ పూర్ సమీపంలోని ఇండో నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నంలో ఉన్నారంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీపావళి పండగ రోజున భారీ దాడులు చేయాలనే ప్రణాళికతో వారు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత్ లో ప్రవేశించిన తరువాత ఉగ్రవాదులకు కాశ్మీర్ లో కొందరు వ్యక్తులు అవసరమైన సహాయం అందించాటానికి కూడా సిద్ధమయ్యారు. ఈ విషయాలు వారి ఫోన్ సంభాషణను బట్టి తెలుస్తోంది అని అధికారులు చెబుతున్నారు.
ఉగ్రవాదుల ఫోన్లను ట్రాప్ చేసిన నిఘా విభాగం లొకేషన్ ఆధారంగా చివరి సారిగా నేపాల్ సరిహద్దులో వారిని గుర్తించినట్లు తెలిపింది. ఈ నేపధ్యంలో దేశంలో హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది.మరోవైపు పంజాబ్ లోని రక్షణ స్థావరాలపై దాడి జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వాయుసేన పంజాబ్ లోని పఠాన్ కోట్ స్థావరంతో పాటు ఇతర ఎయిర్ బేస్ లో ఆరెంజ్ నోటీస్ జారీ చేసింది. మరోవైపు జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకూ దాదాపు అరవై మంది ఉగ్రవాదులు ఎల్వోసీ అంతర్జాతీయ సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించారని నిఘా విభాగం తెలిపింది. ఈ రెండు నెలల్లో అరవై మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్, జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. అలాగే దేశ రాజధానికి కూడా ఉగ్రముప్పు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీపావళి సంబరాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్ పూర్ సమీపంలో ఇండో నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నంలో ఉన్నారంటూ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.దీపావళి సంబరాల్లో జాగ్రత్తగా ఉండాలని నిఘా వర్గాల అధికారులు వెల్లడిస్తున్నారు.