జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ

జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాj ుణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారికి 2ం2 గన్‌ మెన్‌లను నియమించారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు. జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాయణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు.

Teluguone gnews banner