తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే..
posted on Dec 30, 2015 @ 11:39AM
తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇప్పుడు మిగిలిన ఆరు స్థానాలకు గాను జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ దే హవా సాగింది. ఈ ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు టీఆర్ఎస్.. రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో
నల్గొండ - కాంగ్రెస్ - కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఖమ్మం - టీఆర్ఎస్ - బాలసాని లక్ష్మీ నారాయణ
మహబూబ్ నగర్ మొదటి సీటుకు - టీఆర్ఎస్ - కసిరెడ్డి నారాయణరెడ్డి
మహబూబ్ నగర్ రెండో సీటులో- కాంగ్రెస్ - దామోదర్ రెడ్డి
రంగారెడ్డి మొదటి సీటుకు - టీఆర్ఎస్ - శంభీపూర్ రాజు
రంగారెడ్డి - టీఆర్ఎస్- పట్నం నరేందర్ రెడ్డి
కాగా నిజామాబాద్ నుండి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నారదాసు లక్ష్మణ రావు, భాను ప్రసాద రావులు, వరంగల్ జిల్లా నుండి కొండా మురళి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పురాణం సతీశ్, వీ భూపాల్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.