ఇరికించారా.. ఇరుక్కున్నారా? ఆ మంత్రికి ఊస్టింగేనా?
posted on Oct 31, 2020 @ 12:49PM
తెలంగాణ మంత్రి రాసలీలల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి గారి వలపు కలలే ఆయన కొంప ముంచాయని, బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా చిలిపి పనులు చేస్తుండటం వల్లే అడ్డంగా బుక్కయ్యారని కొందరు చెబుతున్నారు. తనంతట తానే మంత్రి పదవికి ఎసరు తెచ్చుకున్నారని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం మంత్రిని కావాలనే టార్గెట్ చేసి ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు కేబినెట్ లో బెర్త్ క్లియర్ చేసేందుకే ఇలా చేశారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి ఎపిసోడ్ లో ప్రచారంలో ఉన్న సినీ నటి ఇటీవలే ఎమ్మెల్సీ కవితను కలవడం ఆ మంత్రి అనుచరుల వాదనకు బలాన్నిస్తోంది.
కరీంనగర్ మంత్రి లీలలకు సంబంధించి గంటకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఒక హీరోయిన్ పై కన్నేసిన మంత్రిగారు తనకు తెలిసిన మహిళ ద్వారా.. ఈ హీరోయిన్ తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నంచేశారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. ఇటీవల కరీంనగర్ లో జరిగిన షో కి ఆ నటి చీఫ్ గెస్ట్ గా వచ్చిందట. ఇదే సమయంలో మంత్రిగారి కన్ను ఆమెపై పడిందని టాక్. తనకు ఆల్రెడీ పరిచయమున్న బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలితో నటిని తన వశం చేసుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. మంత్రిగారి ఆదేశాలతో మసాజ్ పేరుతో నటిని ఆ మహిళ పార్లర్ కు తీసుకెళ్లిందని, చాటింగ్ లో మంత్రిగారు చెప్పినట్టుగానే.. మసాజ్ చేస్తూ.. నటి ప్రైవేటు ఫొటోలు తీసిందని తెలుస్తోంది. అయితే ఫొటోలు తీయడం గమనించిన నటి.. అక్కడే సదరు మహిళతో గొడవపడి.. ఫొన్ లాక్కుని వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయిన ఆ నటి.. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు.. ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం చేరవేసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తన బంధువులు ఉండటంతో డైరెక్ట్ గా సీఎంకే కంప్లైంట్ వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో డైరెక్ట్ గా ఇంటలిజెన్స్ రంగంలోకి దిగడం, ఏకంగా టీఆర్ఎస్ పార్టీ సొంత ఛానల్ లోనే మంత్రికి వ్యతిరేకంగా కథనాలు వచ్చాయంటున్నారు. అయితే దీనిపై కొన్ని మీడియాలు మంత్రిని వివరణ కోరగా.. అసలు తనకు సంబంధం లేదని.. ఫేక్ స్క్రీన్ షాట్లతో తనను బద్నాం చేస్తున్నారని చెప్పినట్టు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లాలో మరో చర్చ కూడా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే బీజేపీ జిల్లా అధ్యక్షుడి రాసలీలల వ్యవహారం బయటపడింది. మహిళతో సదరు బీజేపీ నేత కలిసిఉన్న విజువల్స్, ఫోటోలు వైరలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాతో పాటు బీజేపీలో కలకలం రేపింది. వెంటనే స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. .ఆ నేతను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అయితే బీజేపీ నేత రాసలీలకు సంబంధించిన విజువల్స్ బయటికి రావడం వెనక.. ప్రస్తుతం రచ్చగా మారిన కరీంనగర్ మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతీకారంగానే మంత్రిని పక్కా ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఇరికించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో కరీంనగర్ కు చెందిన కొందరు అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఈ విషయంపై సీరియస్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇష్యూ కాస్త సీరియస్ కావడంతో మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
మరోవైపు కవితకు మంత్రి పదవిపై కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఖాళీలు లేనందున ఆమె కోసం ఎవరో ఒకరిని కేబినెట్ తప్పించాల్సి ఉంటుంది. అయితే తాజా ఘటనతో కవితకు లైన్ క్లియరైందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పులు లేకుండా మంత్రిగారి కేసు బయటికి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడే కాకున్నా.. కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రి ప్లేస్ లో కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమంటున్నారు గులాబీ లీడర్లు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఓ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి చిలిపి పనులు చేయడంపై రాజకీయపార్టీలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తే ఇలా చేస్తే ఎలా అని.. ప్రశ్నిస్తున్నారు.