అవినీతి మరక అంటని ఆణిముత్యం చంద్రబాబు!
posted on Sep 12, 2024 @ 10:38AM
చంద్రబాబు నిప్పు.. ఆ నిప్పుకు చెదలు పట్టాయంటూ ప్రత్యర్థులు ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. రెండు దశాబ్దాలకు పైగా చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని ప్రత్యర్థులు శతథా చేసిన ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. కోర్టులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి.
వాస్తవానికి చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని, ఆయన తప్పు చేయరు, ఎవరినీ చేయనీయరు అని ప్రతిపక్ష నేతలే ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అయినా రాజకీయ కారణాలలో ఆయనకు అవినీతి మరక అంటించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. న్యాయస్థానాలు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆయనకు ఐఎంజీ భూముల విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకీ ఐఎంజీ భూముల వ్యవహారం ఏమిటంటే.. అమెరికాకు చెందిన ఐఎంజీ సంస్థకు నేఅత్యున్నత క్రీడా సౌకర్యాల కల్పన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2003లో భూములు కేటాయించారు. అయితే ఆ సంస్థ పనులు మొదలు పెట్టడానికి ముందే చంద్రబాబు ప్రభుత్వం గద్దెదిగింది. 2004 ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం ఐఎంజీకి భూములు స్వాధీనం చేయలేదు సరికదా, వాటిని రద్దు చేసింది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఐఎంజీ భూముల కేటాయింపులో అక్రమాలు అంటూ సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై హైకోర్టులో కేసులు వేసారు.
అంతకు ముందు వైఎస్ విజయమ్మ కూడా చంద్రబాబుపై విచారణ జరిపించాలంటూ కోర్టులో కేసు వేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కోరారు. అయితే రాజకీయ కక్షలతో ఆధారాలు లేని కేసులు నమోదు చేశారని వ్యాఖ్యానించిన కోర్టు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ తరువాత విజయమ్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడా విజయమ్మ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
ఆ తరువాత ఐఎంజీ భూముల కేటాయింపులో కుంభకోణం జరిగింది, సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. దానిపై తాజాగా తెలంగాణ హైకోర్టు సీబీఐ విచారణ అవసరం లేదంటూ తీర్పు ఇచ్చింది. ఐఎంజీ భూముల కేటాయింపులో ఎలాంటి కుంభకోణం లేదనీ, ఎలాంటి అవకతవకలూ లేవనీ విస్ఫంష్టంగా తేల్చేసింది. దీంతో చంద్రబాబు నిజాయితీ మరో సారి రుజువైంది.
వాస్తవానికి నాలుగుదశాబ్దాలకు పైగా మచ్చలేని చంద్రబాబు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే.
ఇంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వారిపై ఆరోపణలు రావడం.. కేసులు నమోదవడం సహజం. అయితే చంద్రబాబునాయుడు పై జగనమోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప.. అంతకు ముందు కేసులు లేవు. నేర చరిత్ర ఇసుమంతైనా లేని ప్రజాజీవితం ఆయనది. కానీ ఆయనపై లెక్కేలేన్ని కోర్టుల్లో మాత్రం పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ ఏమీ తేల్చలేకపోయాయి. తాజాగా ఐఎంజీ పిటిషన్లోనూ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది.