భారీ భద్రత మధ్య భారీ యంత్రాలతో కూల్చివేత పనులు
posted on Jul 8, 2020 @ 9:45AM
25ఎకరాల స్థలం సిద్దం చేయడానికి రెండు వారాల సమయం..
సచివాలయానికి వెళ్లే అన్నిదారులు బంద్..
విపక్షాలు ఆందోళనలు చేయకుండా కట్టడి..
తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. విపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగక ముందే పూర్తిగా నేలమట్టం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద పనులు చేస్తోంది. సచివాలయం చుట్టూ ఉన్న రోడ్డులన్నీ బంద్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆందోళనలకు తావు లేకుండా భారీ యంత్రాలతో కూల్చివేత పనులు త్వరత్వరగా చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య 25.5 ఎకరాల సచివాలయం ప్రాంగణాన్ని భారీ కొత్త భవన నిర్మాణం కోసం సిద్దం చేస్తున్నారు.