మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారు: కేసీఆర్
posted on Sep 16, 2014 @ 3:53PM
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు....
* మా ప్రభుత్వాన్ని ప్రతి చిన్న విషయంలోనూ తప్పు పట్టే ప్రయత్నాలు కొన్ని ప్రతిపక్షాలు చేశాయి. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ గోబెల్స్ ప్రచారం చేశాయి. ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి ప్రచారం చేయబోతే ప్రజలు చావుదెబ్బ కొట్టారు. అతితెలివి పనికిరాదని చెప్పారు.
* ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను.
* మెదక్‌లో మరోసారి విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
* ఎన్నికల సందర్భంగా కొన్ని అతిమాటలు విన్నాను. పొన్నాల, టీడీపీ, బీజేపీ నాయకులు అతిగా మాట్లాడారు. ప్రజలు వారికి బుద్ధి చెప్పారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు డిపాజిట్లు మాత్రం దక్కించుకున్నారు.
* ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వాటిని మేం స్వాగతిస్తాం. కానీ అనవసరంగా ప్రతి విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకితే మీకే బూమెరాంగ్ అవుతుంది.
* అమరుల త్యాగఫలితంగా తెలంగాణ ఏర్పడింది. అడ్డదిడ్డంగా పనిచేస్తే కుదరదు. కొంత టైం తీసుకుని పూర్తిగా పరిస్థితులను అర్థం చేసుకుని పనులు చేస్తాం. నిజం చెప్పాలంటే కేసీఆర్ మార్కు పాలన, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా తెలంగాణలో ప్రారంభం కాలేదు. దసరా నుంచి పథకాలు వరుసగా ప్రారంభం అవుతాయి.