కేటీఆర్ ను ఉరి తీయాలి! తీన్మార్ మల్లన్న సంచలనం
posted on Mar 27, 2021 @ 4:20PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీకి చుక్కలు చూపించిన తీన్మార్ మల్లన్న... దూకుడు మరింత పెంచారు. ఉద్యోగం రావడం లేదన్న బెంగతో ఆత్మహత్యా యత్నం చేసిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ ను ఎంజీఎంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. నిరుద్యోగులకు అన్యాయం చేసిన మంత్రి కేటీఆర్‌ను హన్మకొండ చౌరస్తాలో ఉరితీయాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగం పొగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సునీల్‌ను వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.
ఉద్యోగం రావడం లేదన్న బెంగతో కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండేంగ తేజవత్‌రామ్‌సింగ్ తండాకు చెందిన కేయూ విద్యార్థి బోడ సునీల్‌నాయక్ పురుగుల ముందు తాగి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్నేహితులు వెంటనే సునీల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కేయూలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్ష పార్టీల నేతలు ఎంజీఎంకు వెళ్లి సునీల్ ను పరామర్శించారు.
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్‌ను వైఎస్ షర్మిల అనుచరులు పరామర్శించారు. అండగా ఉంటామని అతనికి హామీ ఇచ్చారు. అక్క వస్తోంది..అన్ని కష్టాలు తీరుతాయని సునీల్‌కు షర్మిల అనుచరులు భరోసా ఇచ్చారు.