దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ ఫోటోలు పెట్టుకోండి ... రేవంత్ రెడ్డి
posted on Apr 5, 2013 7:54AM
టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారంవిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ... జగన్, వైఎస్సార్ ఫోటోలు పెట్టుకుంటే ప్రజలకు దొంగలు, దోపిడీదారులు గుర్తుకు వస్తారని భయపడి వైఎస్సార్సీపీ ఎన్టీఆర్, జూ. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నారని, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టుకునే కొత్త బిచ్చగాళ్ళు, పగటి వేషగాళ్ళ పార్టీలను ఇప్పుడే చూస్తున్నామని, ఎన్టీఆర్ నిజాయితీ పరుడని, నిజాయితీకి మారుపేరని అన్నారు. ఆయన ఫోటోను వైఎస్సార్సీపీ పార్టీ ఫ్లెక్సీలపై పెట్టుకుని మలినపరుస్తున్నారని, ఎన్టీఆర్ ఎప్పుడూ వైఎస్సార్ తో రాజీ పడలేదని, జగన్, వైఎస్సార్ ఫోటోలు పట్టుకుని ఓట్లు సంపాదించే రోజులు పోయాయని ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకుందని ఎద్దేవా చేశారు. దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ వంటివారి ఫోటోలు పెట్టుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి వైఎస్సార్సీపీ వారికి సలహా ఇస్తున్నారు.