కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటా.. రేవంత్ రెడ్డి
posted on Aug 14, 2015 @ 11:47AM
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఈ రోజు నోటుకు ఓటు కేసు విచారణలో ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించిందని.. తనను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని అన్నారు. గద్దె దిగే వరకూ కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటానని.. మరో 25 ఏళ్లైనా కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలుస్తానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈకేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్‌సింమాలు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారులు సప్లమెంటరీ సమన్లను కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ చార్జిషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత సమన్లు పంపించనున్నట్లు కోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయిన అనంతరం మరోసారి ఏసీబీ ఎదుట రేవంత్ అయ్యే అవకాశం ఉంది.