టీఆర్ఎస్ ఆ..టీడీపీ ఆ..? జుట్టు పీక్కుంటున్న ఎమ్మెల్యే ఎవరూ..?
posted on Feb 20, 2016 @ 5:24PM
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే పలు పార్టీలోని నేతలంతా టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికి వస్తే టీఆర్ఎస్ తాకిడిక తట్టుకోలేక పోతున్నాయనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న చందాన తయారైంది. కాస్తో కూస్తో పోటీ ఇచ్చే టీడీపీ పరిస్థితి కూడా ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక మిగిలింది ఒకరిద్దరు నేతలు మాత్రమే. అయితే ఇప్పుడు పార్టీ మారిన వారి పరిస్థితి బానే ఉంది. పార్టీని వీడని వారి పరిస్థితి బానే ఉంది. కానీ టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పరిస్థితే అటు కక్కలేకా.. ఇటు మింగలేకా అన్న పరిస్థితి ఏర్పడింది.
టీ టీడీపీ నుండి కీలకమైన నేతలే టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇటీవలే సీనియర్ నేత అయిన ఎర్రబెల్లి.. ఆయనతో పాటు ప్రకాశ్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఎర్రబెల్లి చేరికతో ఆయనతో పాటు ఇంకో ఎమ్మెల్యే కూడా ఆయన వెనుకే టీఆర్ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తాను టీఆర్ఎస్లోకి వచ్చేది లేదని.. టీడీపీలోనే ఉంటున్నానని.. ఆవార్తలు ఆవాస్తవం అని అన్నారు. తాను మాత్రం గాంధేయ మార్గంలోనే నడుస్తానని చెప్పారు.
అయితే చెప్పడానికైతే చెప్పారు కాని తాను మాత్రం అటు ఆపార్టీ ఉండలేక.. ఇటు టీఆర్ఎస్లోకి వెళ్లలేక జుట్టు పీక్కుంటున్నారంట. ఎందుకంటే.. అతనికి టీఆర్ఎస్ లోకి వస్తే ప్రభుత్వం నుండి అతనికి వున్న 20 కోట్ల బకాయిలు రద్దు చేస్తామని ఆఫర్ ఇచ్చారంట. దీంతో ఆ ఎమ్మెల్యే కొంచం ఇంట్రెస్ట్ చూపించినా.. ఇంతలోనే టీడీపీ నుండి షాక్ ఎదురైనట్టు తెలుస్తోంది. అతనికి తన ఊర నందిగామ దగ్గర ఉన్న 100కు పైగా ఎకరాలు ఉండగా వాటి విషయంలో ఇరుకున పడాల్సి వస్తుందని చినబాబు ద్వారా హెచ్చరికలు వచ్చాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేకు ఏం చేయాలో తెలియక అయోమక స్థితిలో ఉన్నారంట. మరి చూద్దాం..ఆయన ఈ పరిస్థితి నుండి ఎప్పుడు బయటపడతారో..