వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లల ఆటలు ఆడుతోంది
posted on Jun 13, 2020 @ 4:53PM
ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రం అభివృద్ధి, నిర్వహణకు ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. భోగాపురం విమానాశ్రయంలో పెద్ద స్కామ్ ఉందని, జీఎంఆర్ కు ఇచ్చేందుకే చంద్రబాబు సర్కార్ కుట్ర చేసిందని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే జీఎంఆర్ తో ఒప్పందం చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఇదే అంశంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు.భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాలను ఒప్పందాలను నాడు కాదన్నారు.. నేడు అదే జీఎంఆర్ సంస్థకు ఇచ్చారు.. ప్రభుత్వానికి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందని అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రయాణికులతో పాటు, ఎయిర్ క్రాప్ట్ మెంటినైన్స్ కార్గో సర్వీసుల కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ నాడు డిజైన్ చేసామని తెలిపారు. తాజాగా ప్రాజెక్ట్‌లో 500 ఎకరాలు తగ్గించారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో తాజా సవరణలతో అనేక ఉద్యోగాలు పోతాయన్నారు. ఇన్పాస్ట్రక్చర్‌తో వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లల ఆటలు ఆడుతోందని.. దీని వల్ల భావితరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి పెరగాలంటే.. గతంలో డిజైన్ చేసిన ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని అశోక్‌గజపతిరాజు డిమాండ్ చేశారు.