ప్రభుత్వానికి ఊపిరాడనీయని టీడీపీ
posted on Sep 16, 2022 @ 11:46AM
శాసనమండలి సమావేశాల్లో రెండవరోజు శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ అధి నేత చంద్రబాబు వ్యవ సాయం దండగ అన్నారంటూ అధికారపక్షం ఎమ్మెల్సీలు, మంత్రులు వ్యాఖ్య లు చేశారు. దీనిపై నారా లోకేష్ , టీడీపీ ఎమ్మెల్సీ లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దమ్ముంటే ఆ మాట ఎక్కడ అన్నారో చూపిం చాలి అంటూ అధికార పక్షానికి లోకేష్ సవాల్ విసిరారు. అధికారపక్షం వ్యాఖ్య లకు నిరస నగా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టిన నిరసనకు దిగారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధాన్యం బకాయిలు కూడా చెల్లించలేని రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ అంటూ లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీలు నినా దాలు చేశారు. ఆధారాలు అంటే ఎక్కడ నుండి తెస్తామంటూ టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు వైసీపీ మంత్రు లు ప్రయత్నించారు. చంద్రబాబు ను ఉద్దేశించి మాట్లాడలేదంటూ అధికారపక్షం ఎమ్మెల్సీలు, మంత్రులు వింత వాదనకు దిగారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీలో కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చారని, కడప స్టీల్‌ప్లాంట్ పై కేంద్రాన్ని ప్రభుత్వం ప్రశ్నించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ, టీడీపీ సభ్యులు సబ్జెక్టుకు కన్పైన్ కావడం లేద న్నారు. కడప స్టీల్ పెట్టేందుకు ఆలోచించొచ్చు అని ఉందన్నారు.
కోవిడ్ వల్ల ప్రపంచ వ్యీప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని వెల్లడించారు. విభజన చట్టంలో ఏముందో సరిగా చూడాలని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చెయ్యోచ్చు అని మాత్రమే ఉందని.. కావచ్చు అని మాత్రమే ఉంది షల్ అని లేదని బుగ్గన తెలిపారు.