టీడీపీ, బీజేపీ.. కలిసుండలేమంటున్న నేతలు
posted on Sep 14, 2015 @ 6:21PM
టీడీపీ, బీజేపీ పార్టీలు రెండూ మిత్రపక్షాలని అందరికి తెలిసిందే. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలైనప్పటికీ అప్పుడప్పుడూ తమ విభేదాలను మాత్రం బయటపెడుతూనే ఉంటారు. ఏదో కేంద్రం ఒకపక్క.. చంద్రబాబు మరోపక్క ఉంటున్నారు కాబట్టి నేతలు ఒకరిపై ఒకరికి ఎంత కోపమున్నా వాటిని మనసులో దాచుకుంటూ కాలం నెట్టుకొస్తున్నారు.
అయితే పశ్చిమగోదావరిలో జరిగిన సంఘటనతో ఇది పైపైన నేతలు చేస్తున్న మెరుపులే అని స్వచ్ఛంగా అర్ధమయింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ, టీడీపీ నేతలు మధ్య గొడవ రాజుకుంది. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ ముదిరి ఇరు పార్టీల సభ్యలు వాదులాడుకున్నారు. దీంతో గూడెం మున్సిపల్ ఛైర్మన్.. ఇక బీజేపీతో కలిసి ఉండలేమని చెప్పేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అన్యాయ చేస్తోందంటూ బీజేపీ... బీజేపీ అన్యాయ చేస్తోందంటూ టీడీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట. ఒకమెట్టెక్కి ఇక కలిసుండేది లేదని కూడా అనుకున్నారు. మొత్తానికి ఈరకంగా ఇరు పార్టీనేతలు తమ కోపమంతా కక్కేసుకుంటూ నిజాన్ని మాత్రం వెళ్లగక్కారు.